
ప్రణాళిక ప్రకారమే ఒలింపిక్స్...
టోక్యో ఒలింపిక్స్ వాయిదా అని జరుగుతున్న ప్రచారాన్ని జపాన్ ఒలింపిక్ మంత్రి సీకో హషిమొటో ఖండించారు. ప్రణాళిక ప్రకారమే టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయన్నారు. పార్లమెంట్ బడ్జెట్ కమిటీ ముందు కూడా ఆయన ఇదే విషయాన్ని తెలిపారు. ‘టోక్యో ఒలింపిక్స్ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌ను రద్దు చేయడం లేదా వాయిదా వేయడం అథ్లెట్లకు ఆమోదయోగ్యం కాదు.'అని హషిమొటో పార్లమెంట్ బడ్జెట్ కమిటీ ముందు స్పష్టం చేశారు.

సాధా సీదాగా.. జ్యోతి ప్రజ్వలన..
ప్రాచీన గ్రీస్ సాంప్రదాయ పద్దతిలో వచ్చే వారం జరిగే టోక్యో 2020 ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా సాధాసిదాగా జరగనుంది. ఎప్పుడూ అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షక సమూహం లేకుండానే నిర్వహించనున్నారు. ఇక అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ కూడా షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ జరుగుతాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్ ముప్పు ఉన్నప్పటికీ.. అథ్లెట్లను సంసిధ్దం చేయాలని టోర్నీలో పాల్గొనే ఆయాదేశాలను కోరింది.

ప్రభుత్వం కీలక ఆదేశాలు..
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వీదేశీ టోర్నీలు, ప్రాక్టీస్ సెషన్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అథ్లెట్ల ఆరోగ్యాన్నే ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు సూచించింది.

ప్రేక్షకుల్లేకుండా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు..
కరోనా దెబ్బకు ఇటలీలోనైతే ప్రేక్షకుల్లేకుండా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆదేశ ప్రభుత్వం మేజర్ క్రీడా ఈవెంట్లన్నిటిని, ముఖ్యంగా సాకర్ గేమ్స్‌ను ప్రేక్షకుల్లేకుండా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించింది.


Click it and Unblock the Notifications


