For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. 30 ఏళ్లు వచ్చాయి.. కంటి చూపు మందగిస్తుంది.. మరింత ప్రాక్టీస్ అవసరం : కపిల్ దేవ్

Kapil Dev Says Virat Kohli needs to practise more, adjust his eyesight
Virat Kohli Needs To Practice More To Adjust His Eyesight Says Kapil Dev | Oneindia Telugu

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పర్యటనలో దారుణంగ విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సూచించాడు. కోహ్లీ ఆటతీరు చూస్తే బహుషా అతని చూపు మందగించినట్లుందని ఈ లెజండరీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. అతని చేయి కదలికలతో పాటు కంటి చూపును, సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించాడు.

30 ఏళ్లు ధాటితే..

30 ఏళ్లు ధాటితే..

‘ఓ నిర్దిష్ట వయస్సు చేరుకున్న తర్వాత, ముఖ్యంగా 30 ఏళ్ల ధాటినప్పుడు సహజంగానే కంటి చూపు మందగిస్తుంది. కోహ్లీ కూడా 30 ఏళ్లు ధాటాడు. స్వింగ్ బంతులను అలవోకగా బౌండరీలు తరలించే కోహ్లీ తడబడుతున్నాడు. ఒకప్పుడు స్వింగ్ బంతులను అలవోకగా బౌండరీలక తరలించే కోహ్లీ న్యూజిలాండ్ పర్యటలో ఫ్లిక్ షాట్లతో రెండు సార్లు ఔటయ్యాడు. అతను తన ఐ సైట్ (కంటి చూపును) సర్ధు బాటు చేయాల్సిన అవసరం ఉందని నా కనిపించింది.'అని కపిల్ దేవ్ ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

‘భారత్‌కు వచ్చినప్పుడు.. నేనేంటో చూపిస్తా'మైదానంలో కోహ్లీ వార్నింగ్!!

మరింత ప్రాక్టీస్ అవసరం..

మరింత ప్రాక్టీస్ అవసరం..

‘బిగ్ ప్లేయర్స్ బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ అవుతున్నారంటే వారికి మరింత ప్రాక్టీస్ అవసరం. ఈ తరహా ఎక్కువగా ఔటైతే వారి చూపు మందగించినట్టు. 18-24 ఏళ్ల వయసులో కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. కానీ తరువాత ఎలా పనిచేస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.'అని కపిల్ చెప్పుకొచ్చాడు.

వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, వివియన్ రిచర్డ్స్ ఇలా అందరూ తమ కెరీర్‌లో ఈ సమస్యను ఎదుర్కొన్నారని కపిల్ దేవ్ తెలిపాడు. కాబట్టి కోహ్లీ మరింత్ర సాధన చేయాలని సూచించాడు. ‘కోహ్లీ మరింత ప్రాక్టీస్ చేయాలి. ఐసైట్ బలహీనంగా ఉంటే.. టెక్నిక్‌ను మరింత పెంచుకోవాలి. ఒకప్పుడు ఓ బంతిని వేగంగా ఆడిన కోహ్లీ.. ఇప్పుడు అదే బంతిని చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు'అని కోహ్లీ లోపాన్ని కపిల్ దేవ్ తెలియజేశాడు.

ఐపీఎల్‌లో చెలరేగుతాడు..

ఐపీఎల్‌లో చెలరేగుతాడు..

ఐపీఎల్ కోహ్లీకి మేలు చేస్తుందని ఈ లెజండరీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ‘ఐపీఎల్ అతనికి సహకరిస్తుందనుకుంటున్నా. అతనో గొప్ప క్రికెటర్. కచ్చితంగా తన తప్పిదాలను తెలుసకొని చెలరేగుతాడు'అని 61 ఏళ్ల కపిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇక రెండు టెస్ట్‌లో సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలపి కోహ్లీ కేవలం 9.50 సగటుతో 38 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో మొత్తం 11 ఇన్నింగ్స్‌లు ఆడిన భారత కెప్టెన్ కేవలం 218 పరుగులే చేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

Story first published: Tuesday, March 3, 2020, 15:43 [IST]
Other articles published on Mar 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+