Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ రోజు అనుష్క శర్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది.. కానీ నేను ఖండిస్తున్నా: కంగనా రనౌత్

Kangana Ranaut stands up for Anushka Sharma after Sunil Gavaskar’s comments

దుబాయ్: క్రికెట్ కామెంటరీలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై చేసిన కామెంట్స్‌తో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అనుకోని వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. బీసీసీఐ అతడిని కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించాలని ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. సన్నీ మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయంటూ విరాట్ సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కూడా ఘాటుగా స్పందించింది.

ఇక తన కామెంట్స్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని తాను ఎవరినీ విమర్శించలేదని, లింగ వివక్ష వ్యాఖ్యలు చేయాలేదని గవాస్కర్ వివరణ ఇచ్చుకున్నాడు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందనుకుంటుండగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎంటరైంది. అనుశ్క శర్మ పట్ల సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది.

అనుష్కా ఆరోజు సైలెంట్‌గా ఉన్నావ్..

అనుష్కా ఆరోజు సైలెంట్‌గా ఉన్నావ్..

గవాస్కర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన కంగన..అనుష్క పేరును ఆయన ప్రస్తావించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. అదే సమయంలో.. తనను గతంలో చట్టాలపై గౌరవంలేని మహిళగా అభివర్ణించినప్పుడు అనుష్క శర్మ ఖండించలేదని గుర్తు చేసింది. ఆమెది ‘ఎంపిక చేసిన స్త్రీవాదం'గా విమర్శించింది.

‘నన్ను బెదిరించినప్పుడు, హర‌మ్‌ఖోర్ అని తిట్టినప్పుడు అనుష్క మౌనంగా ఉండిపోయింది. కానీ ఈ రోజు ఆమె నాలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. సునీల్ గవాస్కర్ అనుష్కాను క్రికెట్‌‌లోకి లాగడాన్ని ఖండిస్తున్నా. కానీ ఈ సెలెక్టివ్ ఫెమినిజం తీరును కూడా తప్పుబడుతున్నా.'అని ట్వీట్ చేసింది.

అనుష్కను ప్రస్తావించాల్సి అవసరం లేదు..

అనుష్కను ప్రస్తావించాల్సి అవసరం లేదు..

ఇక సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అసహ్యకరమైన కామెంట్స్ లేవన్న కంగనా.. ఆమె పేరును ప్రస్తావించుకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ‘లైంగిక కాంక్షతో రగిలిపోతున్న వారికే సునీల్ గావస్కర్ వ్యాఖ్యల్లో అలాంటి డబుల్ మీనింగ్ కామెంట్స్ వినిపిస్తాయి. గవాస్కర్ కూడా అక్కడ అనుష్క పేరును ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ అనుష్క క్రికెటర్‌ పాత్ర పోషిస్తుంది. తన భర్తతో కలిసి ప్రాక్టీస్ చేసిన వీడియోలు చాలా ఉన్నాయి'అని కంగనా ట్వీట్ చేసింది.

అనుష్క బంతులతో..

అనుష్క బంతులతో..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా గవాస్కర్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ గురించి మాట్లాడాడు.

అయితే గవాస్కర్ వ్యాఖ్యలను ఇక్కడ తప్పుగా అర్ధం చేసుకున్నారు. అతను తన కామెంట్రీలో లాక్‌డౌన్‌‌లో అనుష్క బౌలింగ్‌ను మాత్రమే కోహ్లీ ఎదుర్కొన్నాడని చెప్పారు. కానీ కొంత మంది ఈ కామెంట్స్‌లో అనుష్క బౌలింగ్‌కు బదులు అనుష్క బంతులని రాసుకొచ్చారు. ఇవి డబుల్ మీనింగ్‌‌కు దారితీయడంతో అందరూ గవాస్కర్‌పై మండిపడ్డారు. దీనీపై అనుష్క ఆగ్రహం వ్యక్తం చేయడంతో గవాస్కర్ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. తాను ఎలాంటి తప్పిదం చేయలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని స్పష్టం చేశాడు.

మిస్టర్ సునీల్ గవాస్కర్..

మిస్టర్ సునీల్ గవాస్కర్..

అభిమానుల అర్ధం పర్ధంలేని ట్రోలింగ్‌ను సీరియస్‌గా తీసుకున్న అనుష్క.. గవాస్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్టర్ సునీల్ గవాస్కర్ మీ వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. భర్త గేమ్‌ను నిందించడానికి భార్యను లాగుతూ.. డబుల్ మీనింగ్ వాఖ్యలు ఎందుకు చేస్తారు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వస్తుంది. కామెంటేటర్‌గా ప్రతీ క్రికెటర్ వ్యక్తిగత జీవితాలను మీరు గౌరవిస్తారని తెలుసు. అలాంటి మీకు మా పట్ల గౌరవం లేదా? గత రాత్రి నా భర్త ఆటతీరుపై వ్యాఖ్యానించడానికి మీ వద్ద చాలా పదాలు, కామెంట్స్ ఉండే ఉంటాయి. కానీ వాటికి నాపేరును ఉపయోగిస్తేనే మీ విమర్శలు పవర్ ఫుల్‌గా ఉంటాయనుకున్నారా?

2020 వచ్చినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ నన్ను క్రికెట్‌లోకి లాగుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కామెంట్స్ ఎప్పుడు ఆగుతాయో? గౌరవనీయులైన గవాస్కర్.. ఈ జెంటిల్ మెన్ గేమ్‌లో మీరో దిగ్గజం. మీరు నా పట్ల చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత నాకు ఏం అనిపించిందో అది చెప్పాలనుకున్నా'అని అనుష్క తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

జట్టులో ఆ ఇద్దరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్

Story first published: Saturday, September 26, 2020, 15:46 [IST]
Other articles published on Sep 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+