For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విలియమ్సన్ అత్యుత్సాహం.. సెంచరీతో పాటు విజయం దూరం!!

Kane Williamson Overconfidence India win India beat New Zealand via Super Over in the third T20I

హైదరాబాద్ : అత్యుత్సాహం పనికిరాదని భారత్-న్యూజిలాండ్ మూడో టీ20 మరోసారి నిరూపించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్ల ఆటను చూసిన ప్రతీ ఒక్కరికి కుందేలు-తాబేలు పొడుపు కథ గుర్తుకొస్తుంది. 4 బంతుల్లో రెండు పరుగులు చేయలేమా? అనే లెక్కలేని తనం.. తమ గెలుపు ఖాయమనే ధీమా.. సెంచరీ చేయాలనే కెప్టెన్ విలియమ్సన్ తాపత్రయం.. న్యూజిలాండ్ కొంపముంచింది. అలవోకగా గెలిచే మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.

ఫలితంగా సొంతగడ్డపై సిరీస్‌ను చేజార్చుకుంది. మరోవైపు కివీస్ ఆటగాళ్లకు పూర్తి భిన్నంగా ఫలితం‌తో సంబంధం లేకుండా ఆఖరి బంతి వరకు పోరాడిన భారత్ అద్భుత విజయంతో పాటు సిరీస్‌ను చేజిక్కించుకొని చరిత్ర సృష్టింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు గెలిచి న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి సిరీస్‌ను ఒడిసి పట్టుకుంది.

టేలర్ ఉదారత..

టేలర్ ఉదారత..

ఇక ఆఖరి ఓవర్‌లో అద్భుతం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం. క్రీజులో 95 పరుగులతో విలియమ్సన్, 10 పరుగులతో రాస్ టేలర్ ఉన్నారు. కివీస్ విజయం ఖాయమని అందరూ భావించారు. అనుకున్నట్టే షమీ వేసిన తొలి బంతిని టేలర్ అద్భుతంగా సిక్సర్‌గా మలిచాడు. షమీ యార్కర్ వేయడానికి ప్రయత్నించగా ఆ బంతి ఫుల్ టాస్‌ పడగా...టేలర్ ఒక అడుగు ముందుకేసి లెగ్ సైడ్ భారీ షాట్ ఆడాడు. అప్పటికే 95 పరుగులతో క్రీజులో ఉన్న విలిమ్సన్ సెంచరీకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో టేలర్ మరుసటి బంతికి సింగిల్ తీసాడు.

షమీ మ్యాజిక్..

షమీ మ్యాజిక్..

ఇక స్ట్రైకింగ్‌కు వచ్చిన విలియమ్సన్.. ఆఫ్ స్టంప్ మీదుగా షమీ వేసిన షార్ట్ పిచ్ బంతిని అప్పర్ కట్‌తో సిక్సర్‌గా మలచాలనుకున్నాడు. కానీ బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని కీపర్ రాహుల్ చేతిలో పడింది. దీంతో విలియమ్సన్ సెంచరీ చేజారింది. కానీ మ్యాచ్ తామే గెలుస్తామనే ధీమాతో ఈ కివీస్ కెప్టెన్ క్రీజును వీడాడు. అప్పటికీ న్యూజిలాండ్ గెలుపునకు 3 బంతుల్లో రెండు పరుగులు అవసరం. కానీ అప్పుడే షమీ మ్యాజిక్ చేశాడు. క్రీజులోకి వచ్చిన సీఫెర్ట్‌ను అద్భుత బంతులతో కట్టడి చేశాడు. కనీసం బ్యాట్‌కు బంతి తగలకుండా బౌలింగ్ చేశాడు.

IND vs NZ, 3rd T20I: ఉత్కం‘టై'.. సూపర్ ఓవర్ సాగిందిలా..

దీంతో చేసేదేమిలేక సీఫెర్ట్ ఐదో బంతి బ్యాట్‌కు తగలకున్నా పరుగు తీశాడు. అయితే కీపర్ రాహుల్ రనౌట్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే న్యూజిలాండ్ గెలుస్తోంది. అందరూ కివీస్ గెలుపు ఖాయమని భావించారు. కానీ షమీ తన ఆఖరి బంతికి టేలర్‌ను బౌల్డ్ చేసి మ్యాచ్‌టైగా ముగించాడు.

టీమ్ సౌథీకివ్వడం కూడా..

టీమ్ సౌథీకివ్వడం కూడా..

ఇక సూపర్ ఓవర్‌లో విలియమ్సన్, గప్టిల్ 17 పరుగులు చేసి పోరాడే స్కోర్‌నే ఉంచారు. కానీ సూపర్ ఓవర్‌లో బంతిని సౌథీకి ఇవ్వడమే విలియమ్సన్ కెప్టెన్సీ‌పై విమర్శలు వచ్చేలా చేసింది. ఎందుకంటే అతను మొత్తం ఈ మ్యాచ్‌కు ముందు నాలుగు సూపర్ ఓవర్లు వేయగా కివీస్ ఒక్కసారి నెగ్గింది.‌ 17 పరుగులు కాపాడలేకపోయిన సాథీ.. హిట్ మ్యాన్ విధ్వంసానికి మరోసారి బలయ్యాడు. రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన సమయంలో కూడా సౌథీ భారత బ్యాట్స్‌మన్‌ను అడ్డుకోలేకపోయాడు. చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత జట్టులో రోహిత్ శర్మ(65) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(38), కేఎల్ రాహుల్(27)లు ఫరవాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో బెన్నట్ మూడు వికెట్లు పడగొట్టగా... శాంట్నర్, గ్రాండ్‌హోమ్ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగుల చేసింది. భారత బౌలర్లలో ఠాకూర్, షమి రెండేసి వికెట్లు తీసుకోగా.. చాహల్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు.

Story first published: Wednesday, January 29, 2020, 19:27 [IST]
Other articles published on Jan 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+