గంభీర్, నేను మంచి ఫ్రెండ్స్.. కలిసి తినేవాళ్లం : పాక్ క్రికెటర్

కరాచీ: భారత మాజీ ఓపెనర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతం గంభీర్, తాను మంచి స్నేహితులమని, కలిసినప్పుడుల్లా భోజనం కూడా చేసేవాళ్లమని పాకిస్థాన్ సీనియర్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తెలిపాడు. శ్రీలంక వేదికగా 2010లో జరిగిన ఆసియాకప్‌లో ఈ ఇద్దరు క్రికెటర్లు మైదానంలోనే వాదులాడుకున్న విషయం తెలిసిందే. ఒకనొక సందర్భంలో కొట్టుకునేలా కనిపించారు.

మైదానంలో కొట్టుకునేలా..
గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. వికెట్ల వెనుకాల ఉన్న కమ్రాన్ అక్మల్ అస్తమానం అప్పీల్ చేస్తుండటంతో సహనం కోల్పోయిన భారత ఓపెనర్ అతనికి వార్నింగ్ ఇచ్చాడు. దీనికి అక్మల్ కూడా అదే స్థాయిలో బదులివ్వడంతో మైదానంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ మ్యాచ్‌లో అఫ్రిది ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డ్ అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇవ్వగా.. మరోసారి గంభీర్, కమ్రాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఈ క్రమంలో ఇద్దరూ కొట్టుకునేలా ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. అయితే అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పగా.. అప్పుడు గంభీర్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్న నాటి భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సహచరుడిని శాంతపరిచాడు. ఈ వాగ్వాదం క్రికెట్ చరిత్రలో అలా నిలిచిపోయింది. ఇప్పటికీ దీనికి సంబంధించి వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

బెంగళూరులో ఇషాంత్‌తో..
ఆ తర్వాత 2012-13లో భారత్, పాకిస్థాన్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇషాంత్ శర్మతోనూ కమ్రాన్ అక్మల్ వాగ్వాదానికి దిగాడు. ఇది కూడా మైదానంలో జరిగిన వివాదస్పద ఘటనల్లో ఒకటిగా మిగిలింది. అయితే ఈ రెండు ఘటనపై అక్మల్ తాజాగా స్పందించాడు. ‘కవ్ కార్నర్ క్రోనికల్స్' షోలో మాట్లాడుతూ.. ఆ గొడవలను మైదానంలోనే మరిచిపోయామని, గంభీర్, ఇషాంత్‌తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు.

ఆ గొడవలు మరిచిపోయాం..
‘ఆ మ్యాచ్‌లో భేదాభిప్రాయాల కారణంగా ఆ గొడవ జరిగింది. గంభీర్, నేను మంచి ఫ్రెండ్స్. మేమిద్దరం ‘ఏ' క్రికెట్ బాగా ఆడాం. క్రికెట్ టూర్స్ సమయంలో బాగా కలిసేవాళ్లం. కలిసి తినేవాళ్లం. అతను చెప్పింది అర్థం కాకపోవడంతోనే ఈ గొడవ జరిగింది. బెంగళురులో ఇషాంత్‌తో జరిగిన వాగ్వాదం కూడా అలాంటిదే. ఇషాంత్, గౌతమ్ ఇద్దరు మంచి వాళ్లే. ఆ గొడవలు మైదానంలోనే మరిచిపోయాం. ఇప్పటికీ మేం పరస్పరం గౌరవించుకుంటాం.'అని అక్మల్ తెలిపాడు.
కమ్రాన్ అక్మల్ పాకిస్థాన్ తరఫున 53 టెస్ట్‌లు, 157 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఇక అతని తమ్ముడు ఉమర్ అక్మల్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మూడేళ్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే. బుకీలు తనను కలిసిన విషయాన్ని తెలియజేయకపోవడంతో నిషేధం విదిస్తూ బోర్డు చర్యలు తీసుకుంది.
Happy Birthday Rohit Sharma: అంతగా తెలియని హిట్‌మ్యాన్ మూడు రికార్డులు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications