Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రతీ జట్టు ధోనీలాంటి ఫినిషర్‌ను కోరుకుంటుంది : ఆసీస్ కోచ్

Justin Langer Says Every team looking for finishers like Dhoni, Bevan an Hussey

సిడ్నీ: పరిమిత ఓవర్ల‌ ఫార్మాట్‌లో ప్రతీ జట్టు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీలాంటి ఆటగాడిని కోరుకుంటుందని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. ప్రస్తుతం తమకు అలాంటి ఫినిషరే కావాలని ఈ ఆసీస్ కోచ్ చెప్పుకొచ్చాడు. తమ టీమ్‌మేనేజ్‌మెంట్ కూడా అదిపనిలో ఉందని, ధోనీలాంటి ఫినిషర్ కోసం అన్వేషిస్తుందన్నాడు. మంగళవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో లాంగర్ మీడియా మాట్లాడాడు.

ధోనీ బెస్ట్ ఫినిషర్..

ధోనీ బెస్ట్ ఫినిషర్..

‘గతంలో మా జట్టులో మైక్‌ హస్సీ, మైఖేల్ బెవాన్ వంటి ఫినిషర్లు ఉండేవారు. ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ ముగించడంలో వీరు మాస్టర్స్. ధోనీ కూడా బెస్ట్ ఫినిషర్. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో మహీ నాలుగో స్థానంలో వచ్చి 90 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు కప్‌ను అందించాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌లోనూ జాస్‌ బట్లర్‌ మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా ప్రసుత్తం మా జట్టుకు కూడా ధోని లాంటి ఫినిషర్‌ అవసరం ఉంది. జట్టు ఇన్నింగ్స్‌లో ఐదు, ఆరు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు మంచి ఫినిషర్‌లు అయి ఉండాలి.. అందుకోసం అన్వేషిస్తున్నాం' అంటూ లాంగర్‌ చెప్పుకొచ్చాడు.

ఆసీస్ క్లీన్ స్వీప్..

ఆసీస్ క్లీన్ స్వీప్..

సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో ఆసీస్ క్లీన్‌స్వీప్‌కు గురైంది. కాగా సరైన ఫినిషర్‌ లేకనే జట్టు ఓటమి పాలయిందని పలువురు ఆసీస్‌ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అయితే ప్రొటీస్‌తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో మిచెల్‌ మార్ష్‌ ఆరవ స్థానంలో వచ్చి 32, 36 పరుగులు సాధించాడు.

ఆర్సీబీకీ షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం.. ఐపీఎల్‌ రద్దు చేయాలని కేంద్రానికి లేఖ!!

షేక్ హ్యాండ్ ఇస్తాం..

షేక్ హ్యాండ్ ఇస్తాం..

కరోనా వైరస్ నేపథ్యంలో నో షేక్ హ్యాండ్ సంస్కృతికి తెరలేవగా.. లాంగర్ మాత్రం బరాబర్ షేక్ హ్యాండ్ ఇస్తామని చెప్పుకొచ్చాడు. తమ కిట్స్‌లో హ్యాండ్ వాష్ సానిటైజర్స్ పుష్కలంగా ఉన్నాయని.. తాము శుభ్రంగా చేతులు కడుక్కుంటామని తెలిపాడు.

'మేం కరచాలనం చేస్తాం. ఆస్ట్రేలియా కిట్స్‌లో పుష్కలమైన హ్యాండ్ వాష్ సానిటైజర్స్ ఉన్నాయి. మేం కచ్చితంగా షేక్య హ్యాండ్ సంస్కృతిని కొనసాగిస్తాం. ' అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఇక ఆసీస్‌ మాజీ ఓపెనర్ అయిన జస్టిన్‌ లాంగర్‌ 105 టెస్టుల్లో 7696 పరుగులు, 8 వన్డేల్లో 160 పరుగులు చేశాడు. కాగా మాథ్యూ హెడెన్‌తో కలిసి ఆసీస్‌కు టెస్టుల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు.

Story first published: Tuesday, March 10, 2020, 18:11 [IST]
Other articles published on Mar 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+