స్మిత్ ఎగతాళి చేసిన లీచ్‌ను కాదు: అసలు విషయాన్ని వెల్లడించిన లాంగర్

హైదరాబాద్: నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన తర్వాత చేసుకున్న సంబరాల్లో స్టీవ్ స్మిత్ ఎగతాళి చేసింది జాక్ లీచ్‌ని కాదని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు. ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో నిలవడంతో పాటు యాషెస్ ట్రోఫీని సైతం తిరిగి సొంతం చేసుకుంది. నాలుగో టెస్టు విజయానంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైదానంలో పుష్ అప్స్ తీయడంతో పాటు డ్యాన్స్‌లు వేస్తూ కాస్త అతిగానే సంబరాలు చేసుకున్నారు.
అయితే, ఈ సమయంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ లీచ్ తరహాలో స్మిత్ కళ్లద్దాలు పెట్టుకోగా ఆసీస్ ఆటగాళ్లు అతడిని ఔట్ చేస్తున్నట్లుగా నటించారు. దీంతో జాక్ లీచ్‌ను ఎగతాళి చేసినట్లు భావించిన ఇంగ్లాండ్ అభిమానులు స్మిత్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

ఓ మోసగాడు ఇలా వ్యవహరించడం
ఓ మోసగాడు ఇలా వ్యవహరించడం ఆశ్చర్యమేమి కాదని నెటిజన్లు సైతం కామెంట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ అనుకరించింది ఆసీస్ ఆటగాడు క్రిస్ రోజర్స్‌ను అని లీచ్‌ను కాదని హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. ఈ సందర్భంగా లాంగర్ మాట్లాడుతూ "నేను అక్కడే ఉన్నాను. నిజమేంటో నాకు తెలుసు" అని అన్నాడు.
'డియర్ ఇండియా, ఇదీ నా జట్టు అంటే.. వాళ్లు నా జట్టు సభ్యులు'

నేను మైదానంలోనే ఉన్నాను
"ఆసీస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకునే సమయంలో నేను మైదానంలోనే ఉన్నాను. వారు క్రిస్ రోజర్స్ గురించి మాట్లాడుకున్నారు. జట్టులో రోజర్స్ గొప్ప సభ్యుడు. కానీ ఇంగ్లాండ్ అభిమానులు వారికి నచ్చింది ఊహించికొని ప్రచారం చేసుకుంటున్నారు. దానికి మేము బాధ్యత వహించలేం" అని జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు.

ఎవరైనా గొప్పగా ఆడుతుంటే
"ఎవరైనా గొప్పగా ఆడుతుంటే వారిపై ఇలాంటివి సృష్టించడం మామూలే కదా. ఈ సిరీస్‌లో ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు" అంటూ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ మూడు టెస్టులు కలిసి 134.2 యావరేజితో 671 పరుగులు చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఈ సిరిస్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడి 79 పరుగులు చేశాడు. మూడు డకౌట్లు కూడా ఉన్నాయి.
సువర్ణావకాశం: యాషెస్ గెలిచి చరిత్ర సృష్టిస్తే ప్రధానికి నేరుగా ఫోన్ చేస్తా

వార్నర్ పేలవ ప్రదర్శనపై ఇలా
డేవిడ్ వార్నర్ పేలవ ప్రదర్శనపై తనకు ఎలాంటి ఆందోళన లేదని జస్టిన్ లాంగర్ చెప్పడం విశేషం. డేవిడ్ వార్నర్‌కు ఈ సిరిస్‌లో నిరాశపరిచాడని, అతడొక వరల్డ్ క్లాస్ ప్లేయరని పేర్కొన్నాడు. ఆఖరి టెస్టులో వార్నర్ ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు యాషెస్ తమ సొంతమవుతుందని జస్టిన్ లాంగర్ ధీమా వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications