హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు తీసుకున్నా.. నా ఎంపికను ప్రశ్నించే హక్కు మీకు లేదు!

హైదరాబాద్: వివాదాస్పదంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అంబుడ్స్‌మన్ నియామక ఎపిసోడ్‌కు తాత్కాలికంగా తెరపడింది. ఈ విషయంలో కార్యదర్శి విజయానంద్ తదితరులపై అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్‌దే పైచేయి అయింది. తమకు తెలీకుండా, తమ సూచనలను పరిగణలోకి తీసుకోకుండా అజహర్ ఏకపక్షంగా అంబుడ్స్‌మన్‌ను నియమించారని, అది చెల్లదంటూ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వాదిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు స్వయంగా దీపక్ వర్మ దీనిపై స్పందించారు.

అందరి అనుమతితోనే..
అందరి అనుమతితోనే గత జూన్‌లోనే తనను ఎంపిక చేసినట్లు, ఇప్పుడు కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 2న హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ నుంచి వచ్చిన లేఖతో తాను బాధ్యతలు స్వీకరించానని జస్టిస్ దీపక్ వర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు వర్మ నేరుగా లేఖ రాశారు. తన నియామకాన్ని మళ్లీ ప్రశ్నిస్తే న్యాయపరంగా తగిన చర్య తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు.

కరోనా కారణంగా..
‘హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు చేపట్టాలని కార్యదర్శి విజయానంద్ నాకు స్వయంగా లేఖ రాయడంతో నేను అంగీరిస్తున్నట్లు రిప్లే ఇచ్చాను. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అసాధారణ నిర్ణయాల అవసరం ఉంది కాబట్టి జూన్ 6న జరిగిన సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేశారు. పైగా ప్రభుత్వ నిబంధనల కారణంగా ఏజీఎం ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదు. ముందుగా నన్ను నియమించేసి ఆ తర్వాత అంతా చక్కబడిన తర్వాతైనా అధికారికంగా ఆమోద ముద్ర వేయవచ్చని కూడా అదే సమావేశంలో స్పష్టం చేశారు. దీనికి హాజరైన సభ్యులంతా అంగీకారం తెలిపారే తప్ప ఏ ఒక్కరూ అభ్యంతర పెట్టలేదు.

ఏలాంటి అక్రమం జరగలేదు..
అంబుడ్స్‌మన్‌గా నా నియమాకంలో ఎలాం టి అక్రమం జరగలేదు. అపాయింట్‌మెంట్ లెటర్‌పై సంతకం లేకుండా ఉండటం పెద్ద సమస్య కాదు. పైగా నాడు అంగీకారం తెలిపిన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారులకు నన్ను ప్రశ్నించే అధికారం లేదు. మళ్లీ దానిని తప్పుగా చూపిస్తూ ఏవైనా లేఖలు రాస్తే వారిపై చర్య తీసుకుంటాం' అని దీపక్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. వర్మ ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ సంఘానికి కూడా అంబుడ్స్‌మన్‌గా వ్యవహరిస్తున్నారు.

పోలీస్ స్టేషన్ చేరిన గొడవ..
అంబుడ్స్‌మన్ నియమాక విషయంలో అజార్ ఏకపక్షంగా వ్యవహరించారంటూ కార్యవర్గ సభ్యులు ఆరోపించారు. ఇది నిబంధనలకు విరుద్దమంటూ బీసీసీఐ సెక్రటరీ జైషాకు లేఖ రాశారు. దీంతో హెచ్‌సీఏ రాజకీయ రగడ వీధికెక్కింది. ఈ క్రమంలోనే ఇద్దరు ఉద్యోగుల మధ్య నెలకొన్న గొడవ పోలిస్ స్టేషన్‌కు చేరింది. హెచ్‌సీఏ అంపైర్ యూసుఫ్‌తో పాటు తనను దూషించారని, తనపై తప్పుడుప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ హెచ్‌సీఏ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అసోసియేషన్ మెంబర్ సయ్యద్ మొయిజుద్దీన్‌పై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అజార్ ఫిర్యాదు చేశాడు.
US Open 2020: సెమీస్‌కు సెరెనా, ఒసాక.. ఆ వీడియోలు చూసి భావోద్వేగానికి గురైన జపాన్ స్టార్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications