Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అచ్చం సౌరవ్‌ గంగూలీ లాగే విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ: ఆస్ట్రేలియా మాజీ కోచ్

John Buchanan says Like Sourav Ganguly, Virat Kohli has done the same for India

సిడ్నీ: ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేయాలని కూడా సూచించాడు. ఆస్ట్రేలియా టూర్ అతని కెప్టెన్సీకి కఠిన పరీక్ష అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆస్ట్రేలియా కోచ్ జాన్ బుచానన్ మాత్రం కోహ్లీ సారథ్యంపై ప్రశంసల జల్లు కురిపించాడు.

దాదాలానే..

దాదాలానే..

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీలోని నాయకత్వ లక్షణాలు ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీలో ఉన్నాయని జాన్‌ బుచానన్‌ అన్నాడు. దాదాలాగే విరాట్ భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్‌ పోరును మరో స్థాయికి తీసుకెళ్లాడని కొనియాడాడు. తాజాగా 'స్పోర్ట్స్‌స్టార్'తో మాట్లాడిన ఈ ఆసీస్ మాజీ కోచ్ అప్‌కమింగ్ ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌లను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2018-19 పర్యటనలో 2-1‌తో భారత్ టెస్ట్ సిరీస్ నెగ్గడాన్ని ప్రస్తావిస్తూ ప్రశంసల జల్లు కురిపించాడు.

గంగూలీ బాటలోనే కోహ్లీ..

గంగూలీ బాటలోనే కోహ్లీ..

‘సౌరవ్ గంగూలీ టీమిండియా బాధ్యతలు చేపట్టాక ఆటతీరులో మార్పు తెచ్చాడు. కేవలం క్రికెట్‌ ఆడటమే కాకుండా ఆస్ట్రేలియా లాంటి గొప్ప జట్లను ఓడించడం ఎలాగో నేర్పించాడు. ఇరు జట్ల మధ్య ఆధిపత్యానికి అది తొలి అడుగు మాత్రమే. దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లే సామర్థ్యం గంగూలీకి ఉంది. ఇప్పుడు కోహ్లీ కూడా అలాగే ఉన్నాడు. టీమిండియాను మరోస్థాయికి తీసుకెళ్లాడు' అని బుచానన్‌ పేర్కొన్నాడు.

సూపర్ కెప్టెన్సీ..

సూపర్ కెప్టెన్సీ..

'ఇప్పటి వరకు కోహ్లీ పరుగులు చేసినా చేయకపోయినా జట్టును నడిపించే తీరులో మంచి పనే చేశాడు. 2018-19 సిరీస్‌లో చతేశ్వర్ పుజారా మేటి ప్రదర్శన చేశాడు. అప్పుడు కోహ్లీ, రహానె సైతం తమవంతు పాత్ర పోషించారు. అయితే, కోహ్లీ జట్టును నడిపించిన తీరు, నాయకత్వ లక్షణాలే అసలైన గొప్పతనం. అతడు టీమిండియాను గెలిపించడమే కాకుండా ఇతర జట్లను ఓడించే మార్గాలను కనుగొన్నాడు' అని ఈ మాజీ కోచ్‌ వివరించాడు.

విరాట్ గైర్హాజరీ కీలకం..

విరాట్ గైర్హాజరీ కీలకం..

ఇక తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్‌ భారత్‌కు తిరిగి వచ్చేయడంపై స్పందిస్తూ.. అది టెస్టు సిరీస్‌లో కీలకం కానుందని వ్యాఖ్యానించాడు. కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. డెలివరీ సమయంలో అనుష్క దగ్గరే ఉండేందుకు విరాట్ పెటర్నీటి లీవ్ తీసుకున్నాడు. సుమారు రెండు నెలలపాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటన నవంబర్ 27న జరిగే తొలి వన్డేతో షురూ కానుంది. ఈ లాంగ్ టూర్‌లో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు,నాలుగు టెస్ట్‌లు ఆడనుంది.

సారీ వార్నర్.. నీ రెండో కూతురికి విరాట్ కోహ్లీ అంటేనే ఇష్టం: క్యాండీస్ వార్నర్

Story first published: Thursday, November 19, 2020, 13:18 [IST]
Other articles published on Nov 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+