For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక హెడ్ కోచ్‌పై వేటు.. రత్నాయకేకు తాత్కాలిక పగ్గాలు

SLC name Rumesh Ratnayake interim coach, suspended head coach Chandika Hathurusingha

కొలంబో: హెడ్ కోచ్‌ చండికా హతురుసింఘాపై శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) సస్పెన్షన్‌ వేటు వేసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ముందే శ్రీలంక తాత్కాలిక హెడ్ కోచ్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ రుమేష్ రత్నాయకేను నియమించినట్లు శ్రీలంక బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ప్రధాన కోచ్ హతురుసింఘాను పదవి నుంచి పూర్తిగా తొలగించారని మాత్రం స్పష్టం చేయలేదు.

పొరపాట్లు చేసాం:

పొరపాట్లు చేసాం:

'ఏడాదిన్నర కాలంగా కోచ్ పనితీరును గమనిస్తున్నాం. అతని ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. హతురుసింఘాను నియమించిన బోర్డులో నేను కూడా ఉన్నాను. మేము కొన్ని పొరపాట్లు చేసాం. వాటిని సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది' అని ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు షమ్మీ సిల్వా పేర్కొన్నారు. మరోవైపు 'నాకు సంబంధించినంత వరకు ఎస్‌ఎల్‌సీతో నా ఒప్పందం ఇంకా ఉంది' అని చండికా హతురుసింఘా పేర్కొన్నారు.

పేలవ ప్రదర్శన కారణంగానే:

పేలవ ప్రదర్శన కారణంగానే:

కోచ్ హతురుసింఘాను తప్పించడానికి గల కారణాలను షమ్మీ సిల్వా వెల్లడించలేదు. ప్రపంచకప్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శన కారణంగానే హతురసింఘాను పదవి నుండి తప్పించినట్లు తెలుస్తోంది. హతురసింఘాకు భారీ మొత్తంలో నెలవారీ జీతం చెల్లిస్తున్న క్రమంలో అతని సేవలు అవసరం లేదని భావించే శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని మరో సమాచారం. హతురసింఘాకు నెలవారీ జీతం 40 వేల డాలర్లు. ఒక విదేశీ కోచ్‌కు అందులో సగం చెల్లించినా వస్తాడని బోర్డు భావిస్తోందట. హెడ్ కోచ్‌ను ఎంపిక చేయడానికి ఇప్పటికే ముగ్గురు పేర్లను లంక బోర్డు పరిశీలించినట్లు ఆ దేశ క్రీడా మంత్రి హరిన్‌ ఫెర్నాండో పేర్కొన్నారు.

భారత్‌ vs వెస్టిండీస్‌.. తొలి వన్డేకి వర్షం ముప్పు

పరిస్థితి మరీ దారుణం:

పరిస్థితి మరీ దారుణం:

బంగ్లాదేశ్‌ కోచ్‌గా పనిచేస్తున్న హతురసింఘాను 2017 డిసెంబర్‌లో లంక నియమించుకుంది. ఆయన ఆధ్వర్యంలో 20 వన్డేలు ఆడిన శ్రీలంక 13 మ్యాచుల్లో ఓడింది. ఇక అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ప్రపంచకప్‌లో అయితే లంక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మూడు మ్యాచులు వర్షార్పణం కాగా.. మిగిలిన వాటిల్లో మెరుగ్గా ఆడలేదు. కనీసం సెమీస్‌ చేరలేదు. దీంతో లంక జట్టులో ప్రక్షాళన చేపట్టడానికి బోర్డు శ్రీకారం చుట్టారు.

Story first published: Thursday, August 8, 2019, 14:04 [IST]
Other articles published on Aug 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+