నేనేం నేరం చేయలేదు.. విమర్శకులపై ఆర్చర్ ఆగ్రహం

మాంచెస్టర్: 'బయో సెక్యూర్' నిబంధనలను ఉల్లంఘించి వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ జట్టుతో కలిసాడు. ఐదు రోజు ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్న అతనికి రెండు సార్లు కరోనా టెస్ట్ నిర్వహించగా నెగటీవ్ రావడంతో మూడో టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే బయోసెక్యూర్ నిబంధనలను ఉల్లంఘించిన ఆర్చర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇంగ్లండ్, వెస్టిండీస్ మాజీ ఆటగాళ్లు ఆర్చర్‌కు బుద్ది లేదని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక మీడియా కూడా యావత్ ప్రపంచం ముందు ఆర్చర్‌ను ఓ దోషిగా నిలబెట్టింది. అయితే ఇవన్నీ తనను తీవ్రంగా బాధపెట్టాయని ఆర్చర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

నరకంలా అనిపించింది..
అంతగా విమర్శించడానికి తానేం నేరం చేయలేదని విమర్శకులపై మండిపడ్డాడు. జట్టుతో కలిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్చర్.. ఈ ఐదు రోజులు ఓ నరకంలా గడిచిందన్నాడు.‘ఈ వారమంతా నాకు చాలా కఠినంగా గడిచింది. ఐదు రోజుల సెల్ఫ్ ఐసోలేషన్ నన్ను మరింత ఆలోచించేలా చేసింది. మాంచెస్టర్ హోటల్లోనే ఉండిపోవడం నరకంగా అనిపించింది. బెడ్ రూమ్ కర్టెన్ల వెలుపల మ్యాచ్ జరగుతుంటే ఖాళీగా కూర్చోవడం కష్టంగా అనిపించింది.

కెమెరాలు క్లిక్‌మన్నాయి..
ఇక నా ఐదు రోజుల ఐసోలేషన్‌ను ముగించుకొని బయటకు రాగానే నా ప్రతి అడుగుకు కెమెరా క్లిక్‌మనే శబ్దం వినిపించింది. నన్ను చుట్టు ముట్టిన పరిస్థితులు అసౌకర్యాన్ని కలిగించాయి. నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలుసు. దాని పర్యావసనాలు అనుభవించా. నేనేం నేరం చేయలేదు. 'అని తెలిపాడు. ఇక వెస్టిండీస్‌తో మూడో టెస్ట్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకునే సత్తా తమ జట్టుకుందని ఆర్చర్ తెలిపాడు. అద్భుతమైన ఆటగాళ్లు ఇంగ్లండ్ సొంతమని, ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా గాయపడలేదన్నాడు. జట్టు విజయం కోసం అవకాశం వస్తే తాను కూడా సిద్దంగా ఉన్నానని తెలిపాడు.

ఆర్చర్‌కు బుద్ది లేదు..
బుద్దిలేని పనితో ఆటగాళ్లందరినీ రిస్క్‌లో పడేసిన జోఫ్రా ఆర్చర్ పై తనకు ఏమాత్రం సానుభూతి లేదని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మైఖెల్ హోల్డింగ్ అన్నాడు. ‘బయో సెక్యూర్ ప్రోటోకాల్స్ ఉల్లంఘించిన జోఫ్రా ఆర్చర్‌పై నాకెలాంటి సానుభూతి లేదు. అయినా అతను ఎందుకు అలా బుద్దిలేకుండా వ్యవహరించాడో నాకు అర్థంకావడం లేదు. త్యాగం అంటే నెల్సన్ మండేలాది. అతను 27 ఏళ్లు ఓ చిన్నసెల్‌లో ఎలాంటి తప్పిదం చేయకుండా ఉన్నాడు. కానీ ఆర్చర్ కొద్ది రోజులు బయోబబుల్‌లో ఉండలేకపోయాడు.'అని హోల్డింగ్ ఘాటుగా విమర్శించాడు.
గతంలో కూడా ఇబ్బంది పడ్డామని ధోనీ నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు: మాజీ అంపైర్

తనపై చేసిన వర్ణ వివక్ష
తనపై చేసిన వర్ణ వివక్ష వివరాలను ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లీష్ క్రికెట్ బోర్డ్‌కు పంపి చర్య తీసుకోవాలని కోరాడు. 'క్రిస్టల్ ప్యాలెస్ ఫుట్ బాల్ ఆటగాడు విల్ఫ్రైడ్ జహాపై 12 సంవత్సరాల ఓ అబ్బాయి జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. దానిపై నేను స్పందించా. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో గత కొన్ని రోజులుగా నేను జాత్యహంకార వ్యాఖ్యలను ఎదుర్కొన్నా. ఈ వివరాలను బోర్డుకు పంపి చర్యలు తీసుకోమని కోరాను' అని ఆర్చర్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications