
బుమ్రా చెత్త రికార్డు..
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మూడు వన్డేల సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్నడూ లేని విధంగా పరుగులు సమర్పించుకున్న ఈ యార్కర్ల్ కింగ్.. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి వన్డేలో 10 ఓవర్లు వేసి 53 పరుగులిచ్చిన బుమ్రా ఇందులో 13 వైడ్లు వేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
రెండో వన్డేలో 10 ఓవర్లకు 64 పరుగులిచ్చి వికెట్ పడగొట్టకుండా నిరాశపరిచాడు. మూడో వన్డేలో కూడా 10 ఓవర్లకు 50 పరుగులే ఇచ్చి కట్టడి చేసినా ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఈ సిరీస్ అతని యావరేజ్ ఇంపాక్ట్ 11.6 కాగా... అతనికిది ఏ సిరీస్‌లోనైనా ఇదే అత్యంత చెత్త యావరేజ్ కావడం గమనార్హం.
రికార్డుల రారాజు కోహ్లీకి ఏమైంది? 6 నెలలుగా ఒక్క సెంచరీ లేదు..?

గత 6వన్డేల్లో ఒక్క వికెటే..
ఇక చివరిగా ఆడిన ఆరు వన్డేల్లో కలిపి బుమ్రా కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. వరుసగా నాలుగు వన్డేల్లో వికెట్ పడగొట్టలేకపోయాడు. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జరిగిన చివరి వన్డేలో 10 ఓవర్లు వేసిన బుమ్రా 38 పరుగులిచ్చాడు.
గత ఏడాది చివర్లో వెన్ను గాయంతో మూడు నెలలు క్రికెట్‌కి దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా.. జనవరిలో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ.. పునరాగమనంలో బుమ్రా బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు. ముఖ్యంగా.. డెత్ ఓవర్లలో గతంలోలా యార్కర్లని సంధించడంలో ఈ అగ్రశ్రేణి పేసర్ విఫలమవుతున్నాడు

బుమ్రా లయ తప్పాడు: లక్ష్మణ్
జస్‌ప్రీత్ బుమ్రా లయ తప్పడంతో టీమిండియా ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఇటీవల భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ‘జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి భారత్ జట్టులో ఆందోళన కనిపిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. జట్టుకి వికెట్ అవసరమైన ప్రతిసారి బుమ్రా చేతికి బంతిని అందిస్తూ ఉంటాడు. కానీ.. కివీస్ పర్యటనలో బుమ్రానే లయ తప్పాడు. దీంతో.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లు అతడి బౌలింగ్‌ని అలవోకగా ఎదుర్కోగలుగుతున్నారు. ముఖ్యంగా.. రాస్‌టేలర్ ముందుండి బుమ్రా బౌలింగ్‌లో పరుగులు రాబడుతున్నాడు' అని లక్ష్మణ్ తెలిపాడు.

చేతులేత్తేసిన బౌలర్లు..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ (113 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లతో 112)
సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. రాహల్‌కు తోడుగా శ్రేయస్ అయ్యర్(63 బంతుల్లో 9 ఫోర్లతో 62), మనీష్ పాండే (42), పృథ్వీ షా(40) ఫర్వాలేదనిపించాడు.
అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 47.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 305 రన్స్ చేసి 12 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. మార్టిన్ గప్టిల్(66), హెన్రీ నికోలస్ (80) మెరుపులు మెరిపించగా.. చివర్లో గ్రాండ్‌హోమ్ (58 నాటౌట్) దాటిగా ఆడాడు.


Click it and Unblock the Notifications












