Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది మన్కడింగ్ కాదు.. మత్తు రనౌట్: ఆసీస్ మాజీ క్రికెటర్

Jason Gillespie Comes Up With Hilarious New Name For Mankading

న్యూఢిల్లీ: గతేడాది దాదాపు ఇదే సమయానికి క్రికెట్‌కు సంబంధించిన ఓ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది క్రీడా స్పూర్తా? అని ఒక వర్గం ప్రశ్నిస్తే.. నిబంధనల్లో ఉన్నదే కదా! అని మరో వర్గం వాదించుకుంది. ఇంతకీ అదేంటంటరా..? క్రికెట్‌లోని వివాదస్పదకపై రూల్.. 'మన్కడింగ్'. అవును.. గత ఐపీఎల్ సీజన్‌లో అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అయిన రవిచంద్రన్ అశ్విన్ ఈ చర్చను మొదలు పెట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్‌ను అశ్విన్ మన్కడింగ్ పద్దతిలో ఔట్ చేసి వివాదానికి తెరలేపాడు. అశ్విన్ చేసింది ఐసీసీ నిబంధనల ప్రకారం సరైనదే అయినా.. అది క్రీడా స్పూర్తికి విరుద్ధమంటూ.. కొందరు అతనిపై విమర్శల వర్షం కురిపించారు. చివరకు ఈ చర్చ ఎక్కడిదాకా వెళ్లిందంటే ఈ నిబంధన పేరునే మార్చేయాలనే డిమాండ్ వ్యక్తమైంది.

‘బిల్ బ్రౌన్' అని ఎందుకు పిలవరు?

అయితే తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గెలిస్పీ ఈ ఔట్‌కు కొత్త పేరు పెట్టాడు. ట్విటర్ వేదికగా ఓ అభిమాని.. ‘మన్కడింగ్ బదులు దాన్ని బిల్‌ బ్రౌన్ అని ఎందుకు పిలవరు?.. అశ్విన్ మన్కడింగ్ చేశాడు అనే దాని కంటే.. బట్లర్ ‘బిల్ బ్రౌన్' అయ్యాడు అని అంటే బాగుటుందేమో' అంటూ ఆ వ్యక్తి ట్వీట్ చేశాడు. దీని గిలెస్పీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘దాన్ని మన్కడింగ్ అని పిలిచే బదులు.. మత్తు కారణంగా జరిగిన రనౌట్ అంటే బాగుంటుంది'అంటూ గిలెస్పీ ట్వీట్ చేశాడు.

'మన్కడింగ్‌ ఔట్' అంటే ఏంటి?

'మన్కడింగ్‌ ఔట్' అంటే ఏంటి?

క్రికెట్‌ నియమావళి 41.16 ప్రకారం నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ క్రీజు వదిలి ముందుకు వెళితే.. ఆ సమయంలో అతడిని బౌలర్‌ రనౌట్‌ చేసే విధానాన్ని మన్కడింగ్‌ అంటారు. అయితే దీన్ని1947-48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్‌ వినూ మన్కడ్‌ చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్‌ ఔట్‌గా నిబంధనల్లో చేర్చారు. మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. దీంతో పలుమార్లు మన్కడ్ అతన్ని వారించినా వినిపించుకోలేదు. దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత మన్కడ్ అతన్ని రనౌట్ చేశాడు.

కెప్టెన్ అంటే ధోనీ.. పది మ్యాచుల్లో విఫలమైనా చోటు ఉంటుంది: ఆసీస్ మాజీ క్రికెటర్

మన్కడింగ్‌ పదాన్నే పూర్తిగా తొలిగించండి

మన్కడింగ్‌ పదాన్నే పూర్తిగా తొలిగించండి

మరోవైపు ఈ మన్కడింగ్‌ పదాన్నే పూర్తిగా తొలిగించాలని భారత మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ నిబందనకు భారత క్రికెట్ దిగ్గజం పేరును తొలిగించాలని క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్)కి సూచించాడు. అవసరమైతే తొలిసారిగా ఇలా ఔటైన బిల్ బ్రౌన్ పేరు మీదుగా బ్రౌన్డ్ అని పిలువాలంటూ గవాస్కర్ స్పష్టం చేశాడు. అశ్విన్ మన్కడింగ్ చేసిన సమయంలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.

 రనౌట్ అని పిలవండి చాలు..

రనౌట్ అని పిలవండి చాలు..

ఈ వివాదస్పద మన్కడింగ్ రనౌట్‌‌ను కేవలం రనౌట్‌గా పిలువాలని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సూచించాడు. ‘వినూ మన్కడ్ చాలా గొప్ప క్రికెటర్. బిల్లి బ్రౌన్‌‌ను ఆయన న్యాయంగానే ఔట్ చేశారు. సర్ డాన్ బ్రాడ్‌మెన్ సైతం దాన్ని అంగీకరించాడు. కాబట్టి దాన్ని ‘మన్కడెడ్' అని పిలవడం అవమానకరంగా ఉంది. అది వాళ్ల కుటుంబానికి బాధను కలిగిస్తుంది. దీనిని మన్కడింగ్ అని పిలవడం మానేసి రనౌట్ అని పిలవండి" అని అప్పట్లో ట్వీట్ చేశాడు.

Story first published: Sunday, April 12, 2020, 22:58 [IST]
Other articles published on Apr 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+