సూర్య, అభిషేక్‌లను వెనక్కి నెట్టి టీమిండియాలో టాప్ ప్లేస్!
భారత వికెట్ కీపర్- బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యంధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచి.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ఆల్-టైమ్ రికార్డును ఇషాన్ కిషన్ బ్రేక్ చేశాడు. హామిల్టన్ లోని సెడాన్ పార్క్ వేదికగా న్యూజలాండ్ జట్టుతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఈ చారిత్రాత్మక మైలురాయిని ఇషాన్ కిషన్ చేరుకున్నాడు.
న్యూజిలాండ్ జట్టుతో చివరి టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 32 బంతుల్లో ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 2026 క్యాలెండర్ ఇయర్‌లో 37 మ్యాచ్‌ల్లో 1220 పరుగులు పూర్తి చేసిన భారత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 2022లో 31 మ్యాచ్‌లలో 1,164 పరుగులు సాధించి అగ్రస్థానంలో ఉండేవాడు. 2026 సంవత్సరంలోనే అభిషేక్ శర్మ 39 మ్యాచ్‌లలో 1,153 పరుగులు సాధించగా.. సంజు శాంసన్ 30 మ్యాచ్‌లలో 810 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.

అయితే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రియాకు చెందిన కరణ్‌బీర్ సింగ్ పేరిట ఉంది. అతను 2025లో 32 మ్యాచ్‌లలో 1488 పరుగులు చేశాడు. ఇది ఒకే సంవత్సరంలో అత్యధికం. ఈ జాబితాలో రెండో స్థానంలో పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. అతను 2021లో 29 మ్యాచ్‌లలోని 26 ఇన్నింగ్స్‌లలో 1326 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఫయ్యాజ్ అహ్మద్ ఉన్నాడు, అతను 2025లో 40 మ్యాచ్‌లలోని 37 ఇన్నింగ్స్‌లలో 1251 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు.
టీ20ల్లో 2,000 పరుగుల మైలురాయి
ఈ ఇన్నింగ్స్ ద్వారా ఇషాన్ కిషన్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 2,000 పరుగుల క్లబ్‌లో కూడా అడుగుపెట్టాడు. 69 ఇన్నింగ్స్‌లలో 14 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాయంతో ఈ ఘనత సాధించాడు. ఎదుర్కొన్న బంతుల పరంగా అత్యంత వేగంగా 2,000 టీ20 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ(1,024 బంతులు) అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(1,164 బంతులు) రెండో స్థానంలో, ఇషాన్ కిషన్(1,345 బాల్స్) మూడో స్థానం నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


