ధోనీ కూతుర్ని బెదిరించే హక్కు మీకు ఎక్కడిదిరా? ఆకతాయిలపై ఇర్ఫాన్ పఠాన్ ఫైర్!

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తదుపరి మ్యాచ్‌లో సరిగ్గా ఆడకుంటే అతని కూతుర్ని రేప్ చేసి చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆకతాయిలు దిగజారుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు చేసిన వారికి ధోనీ అభిమానులు గట్టిగా బుద్ది చెబతున్నారు. నిజమైన అభిమానులైతే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయరంటూ విరుచుకుపడుతున్నారు. అయితే అభిమానం ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెటర్ల కుటుంబాలపై బెదిరింపులకు పాల్పడే హక్కు ఎవడిచ్చాడంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు.
బాగా ఆడాలనే అనుకుంటారు..
అందరూ ఆటగాళ్లు బాగా ఆడటానికే తమ సాయశక్తుల ప్రయత్నిస్తారని, కానీ కొన్ని సార్లు అది కుదరదని పఠాన్ చెప్పుకొచ్చాడు. అంతమాత్రాన వ్యక్తిగత దూషణకు దిగడం సమంజసం కాదన్నాడు. ‘అందరూ బాగానే ఆడాలనుకుంటారు. కొన్నిసార్లు కుదరకపోవచ్చు. అంతమాత్రాన చిన్నారులను బెదిరించే హక్కు ఎవరీకి లేదు. కొంచెం బుద్దిగా వ్యవహరించండి. మర్యాదగా నడుచుకోండి'అనే యాష్ ట్యాగ్‌లతో ట్వీట్ చేశాడు.

చెన్నై ఓడటంతో..
భారత క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో గెలుపు దిశగా దూసుకెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఆఖర్లో తడబడి చేతులెత్తేసింది. మిడిల్ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ విఫలమవ్వగా.. క్రీజులో కడవరకు నిలిచినా కేదార్ జాదవ్ ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఓడింది.

ఇంత దిగజారుడుతనమా.?
ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమికి జాదవ్ కారణమని ధోనీ అభిమానులు ట్రోల్ చేయగా.. ధోనీ కూడా ఏం తక్కవ కాదని, అతనికి కూడా అంతే బాధ్యత ఉందని మరికొందరు కామెంట్ చేశారు. విమర్శల వరకు ఈ ట్రోలింగ్ బాగానే ఉన్నా.. వ్యక్తిగత దూషణలకు దిగడం, కుటుంబ సభ్యులను అత్యాచారం చేస్తామని బెదరింపులకు దిగడం ఇప్పుడు అందరిని విస్మయపరుస్తోంది. ధోనీ కూతరు ఆరేళ్ల చిన్నారి జీవాపై విషం చిమ్ముతూ కొందరూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు ధోనీ సరిగ్గా ఆడనట్లయితే జీవాపై అత్యాచారం చేసేందుకు వెనుకాడమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

గెలవలేకపోయిన చెన్నై..
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రాహుల్ త్రిపాఠి (51 బంతుల్లో 81; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. డ్వేన్ బ్రేవోకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. వాట్సన్ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమవడం.. చివర్లో ధాటిగా ఆడకపోవడంతో మూల్యం చెల్లించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
RR vs DC: రఫ్ఫాడించిన రాజస్థాన్.. ఢిల్లీ తడ ‘బ్యాటు'