
షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్ టాపార్డర్ చేతులెత్తేసినా.. మిడిలార్డర్‌లో మార్కస్ స్టోయినిస్(30 బంతుల్లో 4 సిక్స్‌లతో 39), షిమ్రాన్ హెట్‌మైర్(24 బంతుల్లో 5 సిక్స్‌లు 1 ఫోర్‌తో 45) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ ముందు 185 పరగుల లక్ష్యం నమోదైంది. రాజస్థాన్ కట్టుదిట్టమైన ఫీల్డింగ్, బౌలింగ్‌తో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది.
రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రాహుల్ తెవాటియా, ఆండ్రూ టై చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ రనౌట్ కావడం గమనార్హం. చిన్న మైదానమైన షార్జాలో బౌండరీల వర్షం కురుస్తుందనుకుంటే.. బౌలర్లు వికెట్ల వేట కనిపించింది.
ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి మంచి ఆరంభం దక్కలేదు. ఆర్చర్ వేసిన రెండో ఓవర్‌లోనే ఓపెనర్ శిఖర్ ధావన్(5) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం పృథ్వీ షా(19) ఓ సిక్స్ రెండు బౌండరీలతో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అదే జోరులో ఆర్చర్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ మరుసటి ఓవర్‌లోనే అండర్-19 ప్లేయర్ యశ్వంత్ జైస్వాల్ సూపర్ ఫీల్డింగ్‌కు శ్రేయస్ అయ్యర్(18 బంతుల్లో 4 ఫోర్లతో 22) రనౌట్ అయ్యాడు. దాంతో ఢిల్లీ పవర్ ప్లే ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన పంత్(5), మార్కస్ స్టోయినిస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ పంత్ అలసత్వంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్ ధాటిగా ఆడాడు. మరోవైపు స్టోయినిస్ కూడా బౌండరీలు బాదాడు. అయితే రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో స్టోయినిస్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక వికెట్ హెట్ పడినా హెట్‌మైర్ వీలు చిక్కిన బంతిని సిక్సర్‌గా మలిచాడు.
కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అతను అదే ఊపులో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. చివర్లో అక్సర్ పటేల్ (17), హర్షల్ పటేల్(16 నాటౌట్) ధాటిగా ఆడకపోవడంతో ఢిల్లీ 184 పరుగులకే పరిమితమైంది.