గౌతం గంభీర్ టీమిండియా కెప్టెన్‌గా కొనసాగాల్సింది: ఇర్ఫాన్ పఠాన్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌పై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. గంభీర్ కెప్టెన్సీ స్కిల్స్ అద్భుతమని, అతను మరింత కాలం భారత జట్టుకు సారథ్యం వహించాల్సిందని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బీజేపీ ఎంపీ కెప్టెన్సీని కొనియాడాడు. ఇక భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్‌కప్ విజయాల్లో గంభీర్ కీలక పాత్ర పోషించిన తెలిసిందే. రెండు మెగా టోర్నీల ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. అయితే గంభీర్‌కు రావాల్సిన పేరు మాత్రం అంతగారాలేదు. అయితే గంభీర్‌కు సంబంధించిన మరో విషయం కూడా క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలియదు. అతను భారత జట్టుకు సారథ్యం కూడా వహించాడు.

గంభీర్ సారథ్యంలో..
6 వన్డేల్లో భారత జట్టును నడిపించిన గంభీర్.. 6 మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు చేతిలో 5-0తో న్యూజిలాండ్ వైట్‌వాష్‌కు గురైంది. ఇక ఐపీఎల్‌లో కూడా గంభీర్ కెప్టెన్‌గా తనసత్తా చాటాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథిగా.. 2012, 2014 సీజన్‌లో ఆ జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన పఠాన్.. గంభీర్ మరికొంత కాలం భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండాల్సిందన్నాడు.

వాళ్లను తక్కువ చేసినట్టు కాదు..
ఇక గంభీర్ సారథిగా కొనసాగాలని చెబుతున్నానంటే.. దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీలను తక్కువ చేసినట్లు కాదని స్పష్టం చేశాడు.‘సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే కెప్టెన్సీపై నాకు చాలా గౌరవం ఉంది. కెప్టెన్‌గా అద్భుతంగా రాణించడంతో గంభీర్ మరికొంత కాలం భారత జట్టును నడిపించాల్సిందని నాకనిపించింది. అతనో గొప్ప కెప్టెన్‌గా గుర్తింపు పొందేవాడనిపించింది. ఇక రోహిత్, కోహ్లీలను నేను అభిమానిస్తానంటే.. ధోనీపై నాకు ఇష్టం లేదన్నట్లు కాదు'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

ద్రవిడ్ కెప్టెన్సీ సూపర్
ఇక టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్‌పై కూడా పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా అతని సారథ్యంలో ఛేజింగ్‌లో భారత్ వరుసగా గెలిచిన 16 వన్డేల విక్టరీలను ప్రస్తావించాడు. ‘రాహుల్ ద్రవిడ్ గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు.. అంత మాత్రనా ప్రజలకు ద్రవిడ్‌పై ఇష్టం లేనట్టా..? అలా ఏం ఉండదు. ద్రవిడ్ సారథ్యంలో భారత్ చేజింగ్‌లో రికార్డు సృష్టించింది. వరుసగా 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కొన్నిసార్లు ఇలాంటి రికార్డులు మరుగనపడిపోతాయి. ఫలితాల ఆధారంగానే కెప్టెన్‌కు పేరొస్తుంది. అలా అద్భుతమైన జట్టుతో విజయాలందుకున్న సారథి మహేంద్ర సింగ్ ధోనీ'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ జరుగుతుంది సరే.. రూ.3 వేల కోట్లు వస్తాయా? ఆందోళనలో స్టార్ గ్రూప్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications