
రూ.3వేల కోట్ల లాభాలు..
స్టార్ గ్రూప్ అంచనా ప్రకారం ఈ లీగ్ ద్వారా రూ.3 వేల కోట్ల లాభాలు తమ ఖాతాలో వేసుకుంటుందా? అంటే సందేహమే. వాస్తవానికి మార్చిలో తొలిసారి లీగ్ వాయిదా పడకముందు.. స్టార్ తమకు సంబంధించిన వ్యాపార లావాదేవీలను 75శాతం పూర్తి చేసుకుంది. దీంతో కచ్చితంగా రూ. 3 వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. కానీ గత ఐదు నెలలుగా కొవిడ్-19 విశ్వరూపానికి దేశంలో మార్కెట్ పరిస్థితి తలకిందులైంది. ప్రజలతో పాటు కార్పొరేట్ కంపెనీలు కూడా ఆర్థికంగా కుదేలయ్యాయి.

అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ..
ఈ తరుణంలో ఐపీఎల్‌లాంటి భారీ లీగ్‌పై డబ్బులు కుమ్మరించేందుకు కంపెనీలు ముందుకు రాకపోవచ్చని స్టార్, డిస్నీ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ కూడా అభిప్రాయపడ్డారు. ఏ కంపెనీకైనా తమ ఉత్పత్తుల ప్రచారానికి ఐపీఎల్‌ను మించిన టోర్నీ లేదు. కంపెనీలు యాడ్స్‌కే వందల కోట్లు ఖర్చుపెట్టేవి. కానీ కరోనా దెబ్బకు పరిస్థితులు మారాయి. టోర్నీ జరిగే సెప్టెంబర్‌లోగా మార్కెట్ పుంజుకోవడం అనుమానమే.

ఒప్పందాలు రద్దు..
గతంలో స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో కొన్ని ఇప్పటికే వైదొలగగా, మరికొన్ని రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐపీఎల్ తుది షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించకపోవడం కూడా స్టార్‌కు ఇబ్బందిగా మారింది. ఇంతకుముందు మూడు నెలల ముందుగానే తమ ప్రచార కార్యకలాపాల్లోకి దిగేది. కానీ ప్రస్తుతం ఇంకా ఎలాంటి మార్కెటింగ్ పనులూ చేపట్టలేదు.

దెబ్బకొట్టిన చైనా వ్యతిరేక ప్రచారం
కరోనా సంక్షోభానికి తోడు ప్రజల్లో నెలకొన్న చైనా వ్యతిరేక ప్రచారం కూడా దెబ్బకొట్టనుంది. ఒప్పో, వివోతో పాటు మరికొన్ని సంస్థలు ఐపీఎల్‌కు రెగ్యులర్‌గా ప్రకటనలిస్తుంటాయి. ఈ సమయంలో వీరి నుంచి దక్కే ఆదాయం కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇక ఆగస్టు 2న జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) సమావేశం తర్వాత లీగ్ నిర్వహణపై బోర్డు క్లారిటీ ఇవ్వనుంది. లీగ్ విధివిధానాలకు సంబంధించి తయారు చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)ను ఫ్రాంచైజీలకు బోర్డు అందజేయనుంది. ఫుల్ షెడ్యూల్ కూడా అప్పుడే రానుంది. ఇప్పటికే దీపావళి సీజన్ కలిసొచ్చేలా లీగ్ షెడ్యూల్‌ను రూపొందించాలని స్టార్ ఇండియా బీసీసీఐకి సూచించింది.


Click it and Unblock the Notifications

ఐపీఎల్ 2020 సీజన్ బరిలో మన తెలుగోళ్లు ముగ్గురే!










