Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉగ్రవాదితో పోల్చడంపై మండిపడ్డ పఠాన్.. స్పందించిన బాలీవుడ్ భామ

Irfan Pathan disgusted over being called next Hafiz Saeed

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికగా తనను ఓ ఉగ్రవాదితో పోల్చడంపై టీమిండియా మాజీ ఆల్‌‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. ఇలాంటి కామెంట్లు చూస్తుంటే అసలు మనం ఎక్కడికి చేరుకున్నామనే అనుమానం కలుగుతుందని ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఇలాంటి విచిత్ర మనస్తత్వాలు కలిగిన జనాలను చూస్తుంటే.. మనం ఎక్కడి చేరుకున్నాం? అనిపిస్తుంది. ఇది చాలా సిగ్గు చేటు.. ఏ మాత్రం సహించలేనిది'అని ఆగ్రహంగా ట్వీట్ చేశాడు.

ఇంతకి ఏం జరిగిందంటే..

భారత మాజీ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రేగ్ చాపెల్ కారణంగా తన కెరీర్ నాశనం అయిందనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పఠాన్ చెప్పుకొచ్చాడు. తన బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్‌కు చాపెల్ కారణం కాదని, అది సచిన్ టెండూల్కర్ ఆలోచనని తెలిపాడు. చాపెల్ భారతీయుడు కానందున చాలా తేలిగ్గా నిందలు మొపుతున్నారన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలపై ఓ ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. పఠాన్‌ను జమాత్ ఉద్ దావా ఉగ్రవాద సంస్థ నేత హాఫీజ్ సయీద్‌తో పోల్చాడు. ‘మరో హఫీజ్ సయీద్ కావాలన్న తన ఆశయాలను పఠాన్ ఏమాత్రం దాచుకోవడం లేదు'అని ఘాటుగా ట్వీట్ చేశాడు.

స్పందించిన బాలీవుడ్ భామ..

ఈ ట్వీట్ నెట్టింట తెగవైరల్ కావడంతో పఠాన్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా హాట్‌టాపిక్ అయింది. దీనిపై బాలీవుడ్ నటి రిచా చదా స్పందిస్తూ.. అది ఫేక్ అకౌంట్. నిజమైన వ్యక్తి కాదంటూ కామెంట్ చేసింది. దీనికి పఠాన్ ఫేక్ అకౌంట్ అయినా ఎవరో ఒకరు మేనేజ్ చేయాల్సిందే కదా అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ సంభాషణ నెట్టింట హాట్ టాపిక్ అయింది. పఠాన్‌ను ఇలా ఉగ్రవాదితో పోల్చడం సరికాదంటూ అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పఠాన్ ముస్లిం అనే..

పఠాన్ ముస్లిం అనే..

ఇక పఠాన్ ఇలా సోషల్ మీడియా వేదికగా మత వివక్షను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అతని మతాన్ని ప్రస్తావిస్తూ ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే జాతి వివక్షపై జరుగుతున్న చర్చలో మత వివక్షను కూడా పఠాన్ ప్రస్తావించాడు. మత, వర్ణ, కుల, జాతి వివక్షలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డాడు.

అది సచిన్‌ నిర్ణయం..

అది సచిన్‌ నిర్ణయం..

ఇటీవల ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫో 'బియాండ్‌ ది ఫీల్డ్' అనే కార్యక్రమంలో మాట్లాడిన పఠాన్ తన బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్ వెనుకున్న కారణాన్ని వెల్లడించాడు. 'నేను రిటైర్మెంట్‌ ఇచ్చాక కూడా ఈ విషయంపై స్పష్టతనిచ్చా. నా కెరీర్‌ అర్ధంతరంగా ముగిసిపోడానికి ఛాపెల్‌ కారణమని భావించే వారికి అసలు విషయం చెప్పదల్చుకున్నా. నన్ను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేయమని సచిన్‌.. అప్పటి కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు సూచించాడు. నేను బాగా సిక్సులు కొట్టగలనని, కొత్త బంతితో ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోగలనని చెప్పాడు. అలా నన్ను 2005లో శ్రీలంక సిరీస్‌లో తొలి వన్డేలో టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దింపారు' అని స్పష్టం చేశాడు.

ఇంగ్లండ్ ప్లేయర్‌కు కరోనా లక్షణాలు.. ఆందోళనలో ఇతర ఆటగాళ్లు!

Story first published: Friday, July 3, 2020, 15:23 [IST]
Other articles published on Jul 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+