IPL vs PSL: ఐపీఎల్ వస్తే పీఎస్ఎల్ కూడా రెడీ.. 2027లో మళ్లీ అదే సీన్!
IPL vs PSL: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 12వ సీజన్ 2027లో మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో ఏకకాలంలోనే జరగనుంది. ఈ ఈవెంట్ నిర్వహణ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మార్చి 18 నుంచి మే 2 వరకు ఉన్న కాలాన్ని నిర్ణయించింది. వరుసగా మూడో ఏడాది కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏకకాలంలో జరగడం గమనార్హం. 2016 నుంచి 2024 వరకు ఫిబ్రవరి-మార్చి నెల్లో జరిగిన ఈ లీగ్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్ వంటి ఐసీసీ టోర్నమెంట్ల షెడ్యూల్స్ కారణంగా 2025 నుంచి ఏప్రిల్-మే నెలలకు మారాల్సి వచ్చింది.
ఈ టోర్నీని జనవరి-ఫిబ్రవరి విండోలో నిర్వహించడంపై పీసీబీ, ఫ్రాంచైజీల మధ్య తీవ్ర చర్చలు జరిగాయి.అయితే పంజాబ్ ప్రాంతం పరిధిలోని లాహోర్, ముల్తాన్, రావల్పిండి వేదికలలో ఆ సమయంలో తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు వల్ల దృశ్యమానత లోపించడం ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉందని భావించారు. అంతే కాకుండా జనవరి-ఫిబ్రవరిలో లీగ్ నిర్వహిస్తే మ్యాచ్‌ల కీలక భాగాలు రంజాన్ మాసంలో పడటం వల్ల బ్రాడ్‌కాస్టర్లు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పీసీబీ 8 ఫ్రాంచైజీల అభిప్రాయాలను ఇ-మెయిల్ ద్వారా స్వీకరించగా.. మెజారిటీ ఫ్రాంచైజీలు మార్చి-మే విండోకే మొగ్గు చూపాయి. 2020 నుంచి పీఎస్ఎల్ పూర్తిస్థాయిలో పాకిస్తాన్‌లోనే నిర్వహించబడుతున్నప్పటికీ.. భద్రతా కారణాలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వేదికలపై పీసీబీ ఇంకా స్పష్టమైన అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. గత సీజన్లో పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన పొదుపు చర్యల వల్ల టోర్నీని లాహోర్ కరాచీలకు పరిమితం చేసి ప్రేక్షకులు లేకుండా నిర్వహించాల్సిన వచ్చిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


