Shashank Singh: వంట మనిషిపై దాడి.. పంజాబ్ క్రికెటర్‌పై కేసు!
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శశాంక్ సింగ్‌పై పోలీస్ కేసు నమోదయ్యింది. తన ఇంట్లో పనిచేసే వంట మనిషి ఫిర్యాదు చేయడంతో శశాంక్ సింగ్‌తో పాటు అతని తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు భోపాల్ పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం క్రీడా, పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. శశాంక్ సింగ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన విపేంద్ర సింగ్ తోమర్.. ఇటీవలే శశాంక్ ఇంట్లో వంట మనిషిగా పనికి చేరాడు. ఉచిత వసతి, భోజనం, నెలకు రూ.15,000 జీతంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం పొందడంలో సాయం చేస్తామని చెప్పి అతన్ని శశాంక్ ఫ్యామిలీ పనిలో పెట్టుకుంది.

అయితే వంటల్లో నాణ్యత లేదని శశాంక్, అతని తండ్రి, మరో వ్యక్తి దూషించడంతో విపేంద్ర సింగ్ పని మానేయాలనుకున్నాడు. అందుకు వారు అంగీకరించలేదని, చేయి చేసుకోవడంతో పాటు మొబైల్ ఫోన్ సైతం లాక్కున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. అతని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
బాధితుడి ఫిర్యాదు నేపథ్యంలో అతని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించామని, అందులో బాధితుడి శరీరం, ముఖంపై స్పష్టమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో ధృవీకరించారని పోలీసులు తెలిపారు. దీంతో బాధితుడి ఫిర్యాదును, మెడికల్ రిపోర్టులను ప్రాతిపదికగా తీసుకుని తదుపరి చర్యలు చేపట్టామని రాతిబాద్ పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో కుటుంబ డ్రైవర్‌ను కూడా పోలీసులు సహ నిందితుడిగా చేర్చి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని వేర్వేరు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బహిరంగంగా అసభ్య పదజాలంతో దూషించడం (సెక్షన్ 296-బి), ఉద్దేశపూర్వకంగా గాయపరచడం లేదా దాడి చేయడం (సెక్షన్ 115-2), ఉమ్మడి నేరపూరిత ఉద్దేశంతో గ్రూపుగా దాడి చేయడం (సెక్షన్ 3-5) కింద కేసులను నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

