ఇంత టాలెంటెడ్‌ను కోచ్‌గా పెట్టుకోలేం: గంభీర్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్స్!
పసికూన ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడటంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసోసియేట్ దేశమైన ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను లక్ష్యంగా చేసుకొని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఐర్లాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత ఆడిన తొలి సిరీస్‌లోనే టీమిండియా ఓటమిపాలవ్వడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలై సిరీస్‌ను చేజార్చుకుంది.
ఈ సిరీస్ ముగిసిన నిమిషాల వ్యవధిలోనే ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు ఎక్స్ వేదికగా ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. 'మేం గౌతమ్ గంభీర్‌ను మా కోచ్‌గా నియమించాలనుకోవడం లేదు. మాకు ఇష్టం లేదు కూడా. కానీ అతనిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. గొప్ప ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లను తీసుకుని ఐర్లాండ్ పిచ్‌లపై ఇలాంటి పేలవ ఫలితాలు రాబట్టాలంటే నిజంగానే ప్రత్యేకమైన ప్రతిభ కావాలి. అది గంభీర్ వద్ద పుష్కలంగా ఉందనిపిస్తోంది.’అని ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్లు పేల్చింది.

ఐర్లాండ్ పర్యటనలో భారత్ బౌలింగ్ విభాగంలో రాణించినప్పటికీ.. బ్యాటింగ్ వైఫల్యం జట్టును ముంచేసింది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన సంజూ శాంసన్ విఫలమవ్వడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప లక్ష్యాలను సైతం ఛేదించలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.
ఐర్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే భారత్ జూలై 1 నుంచి జూలై 11 వరకు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టూర్‌లో ఆడే అవకాశం రాని 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, జూలై 1న ఇంగ్లాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. జట్టులో మార్పులతోనైనా భారత్ మళ్లీ విజయాల బాట పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

