న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌కు క్రికెటర్ల సతీమణుల్ని అనుమతించాలా? వద్దా? బీసీసీఐ మల్లగుల్లాలు

IPL Franchises sweat over WAGs, local drives, security, hospitality before commencement of new season

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఆటకు యూఏఈలో ఏర్పాట్లు జరుగుతుండగా... భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇక్కడ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)పై సమాలోచనలు చేస్తోంది. లీగ్‌కు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తోంది. ఆటగాళ్ల రక్షణ కోసం ఏర్పాటు చేయబోయే జీవ భద్రత వలయంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన బోర్డును అసలు కంటే కొసరు సమస్యే కాస్త తికమక పెడుతున్నట్లుంది.

 వైఫ్స్ అనుమతిపై తర్జనభర్జన..

వైఫ్స్ అనుమతిపై తర్జనభర్జన..

ఆటగాళ్ల సతీమణులు, ప్రియురాళ్లను బుడగలోకి తీసుకురావాలా లేదంటే ఇప్పుడున్న కరోనా ప్రొటోకాల్‌ పరిస్థితుల్లో అనుమతి నిరాకరించాలా అన్న అంశంపై బోర్డు తర్జనభర్జన పడుతోంది. దీనిపై ఫ్రాంచైజీల నుంచి భిన్నవాదనలు వచ్చినట్లు తెలిసింది. కొన్ని ఫ్రాంచైజీలేమో అసలే బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లుగా గప్‌చుప్‌గా (ప్రేక్షకుల్లేకుండా) జరిగే ఈవెంట్‌ కాబట్టి... ఆటగాళ్లతో కనీసం కుటుంబసభ్యుల్ని అనుమతించాలని సూచిస్తున్నాయి.

పిల్లల సంరక్షణ ఎలా?

పిల్లల సంరక్షణ ఎలా?

ఇతర ఫ్రాంచైజీలేమో వారిని బుడగలోకి తెస్తే... రెండు, మూడేళ్లున్న పిల్లల సంరక్షణ ఎలా? షాపింగ్‌కని, వేరే చోటుకని బుడగదాటితే ఎదురయ్యే పరిణామాలేంటని వారిస్తున్నాయి. ‘సాధారణ టైమ్‌లో ప్లేయర్లతో పాటు వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌ను నీర్ణీత టైమ్‌లో అనుమతించేవాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితి మొత్తం వేరేలా ఉంది. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్‌ను అనుమతిస్తే.. వాళ్లు హోటల్ రూమ్స్‌కే పరిమితమవ్వాలా? కొంత మంది ప్లేయర్లకు మూడు నాలుగేళ్ల చిన్న పిల్లలు ఉన్నారు. రెండు నెలల పాటు వాళ్లను గదిలోనే ఉంచడం సాధ్యం అవుతుందా?'అని ఓ ఫ్రాంచైజీ సినియర్ అధికారిప్రశ్నించారు. దీనిపై త్వరలోనే బోర్డు నిర్ణయం తీసుకొని స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను ఎనిమిది ఫ్రాంచైజీలకు జారీచేయనుంది.

ఫ్రాంచైజీలకు ఆ స్థోమత ఉందా?

ఫ్రాంచైజీలకు ఆ స్థోమత ఉందా?

అలాగే హోటల్ బుకింగ్స్, బస్ డ్రైవర్లు, క్యాటరింగ్ సిబ్బంది విషయంలో కూడా ఫ్రాంచైజీలు తమకున్న అనుమానాలను బోర్డు ముందు ఉంచాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అతిథులు రానివ్వకుండా ఫైవ్ స్టార్స్ హోటల్స్ మొత్తాన్ని టీమ్స్ కోసం బుక్ చేయడం సాధ్యమా?, అన్ని ఫ్రాంచైజీలకు ఆ స్థోమత ఉందా? అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అది కుదరని పక్షంలో త్రీ స్టార్ హోటల్స్, చిన్న రిసార్టులను బుక్ చేసుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు. అలాగే టీమ్ బస్సులను నడిపే లోకల్ డ్రైవర్లు, బ్రేక్ టైమ్‌లో గ్రౌండ్‌లో ఆటగాళ్లకు ఆహారం వడ్డించే క్యాటరింగ్ స్టాఫ్, స్టేడియం లోపల, బయట సెక్యూరిటీ సిబ్బందిని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా సపరేట్ బయో-బబుల్‌లో ఉంచుతారా? లేదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వాళ్లందరికీ ప్రతి రోజు కరోనా టెస్ట్‌లు నిర్వహించాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.. ఈ అంశాలన్నింటిపై ఎస్‌ఓపీలో బీసీసీఐ క్లారిటీ ఇస్తుందని ఆశిస్తున్నాయి.

 ఎమిరేట్స్‌ బోర్డుకు బీసీసీఐ లేఖ

ఎమిరేట్స్‌ బోర్డుకు బీసీసీఐ లేఖ

మరోవైపు ఐపీఎల్ ఆతిథ్యానికి సంబంధించి బీసీసీఐ నుంచి తమకు ఓ లెటర్ కూడా అందిందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సోమవారం ప్రకటించింది. లీగ్ ఆతిథ్యానికి తాము సిద్దమని, భారత ప్రభుత్వం అనుమతే మిగిలిందని ఈసీబీ సెక్రటరీ జనరల్ ముబాషిర్ ఉస్మాని చెప్పారు.

విండీస్‌కు భారీ ఊరట.. ఒక్క బంతీ పడకుండానే నాలుగో రోజు ఆట వర్షార్పణం!

Story first published: Tuesday, July 28, 2020, 7:55 [IST]
Other articles published on Jul 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X