పరిస్థితి మారలేదు.. నా దగ్గరా బదులు లేదు: దాదా

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మాటలకందని విలయంతో విలవిల్లాడుతోంది. కరోనా వైరస్ కారణంగా అడుగు తీసి బయటపెట్టలేని దయనీయ స్థితి నెలకొంది. ఈ ప్రాణాంతక వైరస్ దెబ్బకు వేలకోట్లు వెచ్చించిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలే ఆగిపోయాయి. వచ్చే ఏడాదికి వాయిదపడ్డాయి. అయినా సరే ఐపీఎల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఇంకా తేల్చకుండా... నాన్చుడు ధోరణే కనబర్తుస్తున్నాడు.

నేనేం చెప్పలేను..
ఏప్రిల్ 15 వరకు దేశం లాక్‌డౌన్‌లో ఉండటం.. దాదా మాటలను బట్టి చూస్తే ఐపీఎల్ 13వ సీజన్ జరగడం కష్టంగానే కనిపిస్తోంది. రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ 2020 సీజన్‌కు సంబంధించి తన దగ్గర కూడా జవాబు లేదన్నాడు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో దాదా మాట్లాడుతూ ‘ఈ సమయంలో నేనేమీ చెప్పలేను. లీగ్‌ను వాయిదా వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఏమీ మారలేదు. కాబట్టి నా దగ్గర సమాధానం లేదు. సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.'అని దాదా చెప్పుకొచ్చాడు.
ఓ కోహ్లీ ఒక కోటి ఇవ్వరాదు.. కోట్ల ఆదాయం ఉన్న క్రికెటర్లు విరాళలు ప్రకటించరే?

వాయిదా కూడా కష్టమే..
భవిష్యత్తులో నిర్వహించడంపై కూడా ఎలాంటి ప్లాన్ చేయలేదని గంగూలీ తెలిపాడు. ‘ఫ్యూచర్ ప్రొగ్రామ్(ఎఫ్‌టీపీ) ఉండటంతో నాలుగైదు నెలల తర్వాత లీగ్ నిర్వహించడంపై ఇప్పుడు ఎలాంటి ప్లాన్ చేయలేం. ఎఫ్‌టీపీని మార్చే చాన్స్‌లేదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌తో పాటు అన్ని ఆటలు ఆగిపోయాయి. నష్టం తగ్గించేందుకు ఫ్రాంచైజీలకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుందో లేదో నాకు తెలియదు. అన్నింటిని ముందుగా అంచనా వేయలేం. కొంతకాలం ఎదురు చూడక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టమైన సమాధానం ఇవ్వమంటే నా వల్ల కాదు' అని దాదా చెప్పాడు.

ప్రభుత్వానికి సాయం అందిస్తాం..
కరోనాను ఎదుర్కోనేందుకు బీసీసీఐ తరఫున ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందించే ఆలోచన ఉందని దాదా తెలిపాడు. ప్రభుత్వం కోరితే ఈడెన్ గార్డెన్ ఇండోర్ సదుపాయాల్ని వైద్య అవసరాల కోసం ఇచ్చేందుకు సిద్ధమేనని చెప్పాడు.
కాగా, ప్రధాని మోడీ.. ఏప్రిల్ 15 వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో రద్దుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒలింపిక్స్ వాయిదా పడినప్పుడు ఈ పరిస్థితుల్లో లీగ్‌ను రద్దు చేయకపోతే మూర్ఖత్వమే అవుతుందని బోర్డు సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications