Mumbai Indians ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఆ స్టార్ ప్లేయర్ రెడీ!

చెన్నై: ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ అభిమానులకు ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ శుభవార్త చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం జరగనున్న సెకండ్ మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్, సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ అందుబాటులోకి వచ్చాడని తెలిపాడు. ఇక శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తమ ఫస్ట్ మ్యాచ్‌లో ముంబై 2 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఫైవ్ టైమ్ చాంపియన్ అయిన ముంబై.. ఈ సీజన్‌ను కూడా ఓటమితో ప్రారంభించి తమ ట్రెడిషన్‌ను కొనసాగించింది.
ఇక ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఆలస్యంగా భారత్‌కు వచ్చిన డికాక్.. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఓ వారం క్వారంటైన్‌లో ఉన్నాడు. దాంతో సీజన్ ఫస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా హిట్టర్ క్రిస్ లిన్ పర్వాలేదనిపించాడు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్ కారణమయ్యాడు. దాంతో డికాక్ లేని లోటు స్పష్టంగా కనబడింది.

జట్టుతో కలిసిన డికాక్..
అయితే సెకండ్ గేమ్‌లో డికాక్ బరిలోకి దిగుతాడని జహీర్ స్పష్టం చేశాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన జహీర్.. ముంబై అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పాడు. 'క్వింటన్ డికాక్ క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. జట్టుతో కలిసి ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ సీజన్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడు.'అని జహీర్ చెప్పుకొచ్చాడు.
Mohammad Nabiకి తప్పిన పెను ప్రమాదం.. ఫిలిప్ హ్యూస్‌లానే బలంగా తగిలిన రాకాసి బౌన్సర్. !

ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో..
గత శుక్రవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' హర్షల్ పటేల్ పదునైన బౌలింగ్ (5/27)తో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు సాధించి గెలిచింది. డివిలియర్స్ (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

రాణించిన క్రిస్ లిన్..
గత సీజన్‌లో జట్టుతో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా దక్కని క్రిస్ లిన్ ఈసారి తొలి మ్యాచ్‌లోనే బరిలోకి దిగి రోహిత్ శర్మ (19)తో కలిసి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాడు. అయితే సమన్వయ లోపంతో రోహిత్ రనౌట్ కావడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత లిన్, సూర్య కలిసి ధాటిగా ఆడి పరుగులు సాధించారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు 44 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. సూర్యను చక్కటి బంతితో అవుట్ చేసిన జేమీసన్ ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌ను సాధించగా... తర్వాత వచ్చిన కిషన్ కూడా జోరును కొనసాగించాడు. మరో ఎండ్‌లో సుందర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అతనికే క్యాచ్ ఇవ్వడంతో లిన్ ఇన్నింగ్స్ ముగిసింది.

త్యాగం చేయాల్సింది..
ఇక రోహిత్ శర్మ కోసం తాను ఔటవ్వాల్సిందని మ్యాచ్ అనంతరం క్రిస్ లిన్ అభిప్రాయపడ్డాడు.'మొదటి మ్యాచ్ అది కూడా రోహిత్‌తో కలిసి ఆడనుండటంతో తొలుత కాస్త నర్వస్‌గా ఫీలయ్యాను. నిజానికి నేను పరుగు తీయొచ్చని అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ రనౌట్‌కు ఆస్కారం ఏర్పడింది. ఒకవేళ అవకాశం ఉంటే కెప్టెన్ కోసం నా వికెట్‌ను సమర్పించుకునేవాడిని. ఏదేమైనా ఇలా జరగకుండా ఉండాల్సింది. తప్పిదం జరిగిపోయింది. ఒకవేళ రోహిత్ క్రీజులో ఉంటే ఇంకొన్ని పరుగులు చేసేవాడేమో. మ్యాచ్ ఫలితం కూడా వేరేలా ఉండేది కావొచ్చు. ఏమో ఎవరికి తెలుసు.. మొదటి మ్యాచే నాకు చివరి మ్యాచ్ అవుతుందేమో!'' అని వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications