Mohammad Nabiకి తప్పిన పెను ప్రమాదం.. ఫిలిప్ హ్యూస్‌లానే బలంగా తగిలిన రాకాసి బౌన్సర్. !

చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ నబీకి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తమ ఐపీఎల్ ఫస్ట్ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. మహ్మద్ నబీకి ఓ రాకాసి బౌన్సర్ బలంగా తగిలింది.
సరిగ్గా అది అతని మెడభాగంలో తగలడంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు అందరూ వణికిపోయారు. ఆ బౌన్సర్ దెబ్బకు ఒక్కసారిగా అందరికి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం గుర్తొచ్చింది. కానీ అదృష్టవశాత్తు నబీ గాయం పెద్దది కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ ఇన్నింగ్స్ సందర్భంగా కేకేఆర్ పేసర్ ప్రసిధ్ కృష్ణ వేసిన 16వ ఓవర్‌లో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ నాలుగో బంతిని ప్రసిధ్ కృష్ణ షార్ట్ పిచ్‌గా వేయగా.. దాన్ని మహ్మద్ నబీ పుల్ షాట్ ఆడబోయాడు. కానీ బ్యాట్ అడ్వాన్స్ అవ్వడంతో మిస్సైన బంతి అతని కుడి మెడబాగంలో బలంగా తగిలింది. దాంతో నబీ నొప్పితో విలవిలలాడాడు. ఆ బంతి తాకడాన్ని చూసిన సహచర ఆటగాళ్లు సైతం భయంతో విస్తుపోయారు. కామెంటేర్లు సైతం గట్టిగా అరుస్తూ.. పెద్దగాయం అయినట్లుందని సందేహించారు.

భజ్జీ సైతం..
పక్కనే ఉన్న కేకేఆర్ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెంటనే నబీ దగ్గరకు వచ్చి గాయాన్ని పరిశీలించాడు. కానీ గాయం మాములేనని నబీ సైగలు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన మైదానంలోకి వచ్చిన సన్‌రైజర్స్ ఫిజియోలు నబీ గాయాన్ని పరిశీలించి.. పెయిన్ రిలీఫ్ స్ప్రే చేశారు. అయితే ఆ మరుసటి బంతినే బౌండరీగా మలిచిన నబీ.. చివరి బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ గాయానికి ముందు కూడా నబీ ఫోర్ కొట్టడం విశేషం.

ఏడేళ్ల క్రితం..
ఏడేళ్ల క్రితం (2014, నవంబర్ 25న) ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఇదే తరహా రాకాసి బౌన్సర్‌కు ప్రాణాలు వదిలాడు. ఆసీస్ దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో సౌత్ ఆస్ట్రేలియా, న్యూసౌత్ వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి పేసర్ విసిరిన బౌన్సర్ సౌత్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ అయిన ఫిలిప్ హ్యూస్‌కు బలంగా తగిలింది.
హెల్మెట్ ధరించినప్పటికీ రక్షణ లేని ఎడమచెవి కింది భాగంలో(మెడకు) బంతి తాకింది. దీంతో అతను వెంటనే నేలపై కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరుకొని కోమాలోకి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత సమీపంలోని ఆసుపత్రిలో కన్నుమూశాడు. నిన్న నబీని కూడా బంతి అచ్చం అలానే తాకడంతో అంతా ఉలిక్కిపడ్డారు.
విరాట్ కోహ్లీ.. బాబర్ ఆజామ్‌ను చూసి నేర్చుకోవాలి: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

‘సన్' సత్తా సరిపోలేదు..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు సాధించింది. నితీశ్ రాణా (56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), రాహుల్ త్రిపాఠి (29 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 53) మెరుపులు మెరిపించారు. రషీద్ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసి పరాజయం పాలైంది.
మనీశ్ పాండే (44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 నాటౌట్), జానీ బెయిర్‌స్టో (40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55) అర్ధ సెంచరీలతో పోరాడినా హైదరాబాద్‌ను విజయతీరానికి చేర్చలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా... కీలకమైన బెయిర్‌స్టో వికెట్‌ను కమిన్స్ దక్కించుకొని తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications