For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ.. బాబర్ ఆజామ్‌ను చూసి నేర్చుకోవాలి: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

Aaqib Javed says Virat Kohli can improve technique by seeing Babar Azam so that he doesn’t get trapped
#ViratKohli Can Improve Technique By Seeing Babar Azam - Former Pak Cricketer

కరాచీ: స్వింగ్ బాల్స్‌కు తడబడే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆ సమస్యను అధగమించేందుకు బాబర్ ఆజామ్‌ సాయం తీసుకోవాలని పాకిస్థాన్ మాజీ పేసర్ అకిబ్ జావెద్ సూచించాడు. బ్యాటింగ్ టెక్నిక్‌లో బాబర్ ఆజామ్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌లానే ఎలాంటి సమస్యలు, బలహీతలు లేవన్నాడు. కాకపోతే ఫిట్‌నెస్ విషయంలో బాబర్ ఆజామ్.. విరాట్ కోహ్లీని ఫాలో అవ్వాలని, అలా చేస్తే అతను మరింత గొప్ప ప్లేయర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ విజయంలో బాబర్ ఆజామ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల్లో 103, 31, 94 పరుగులతో రాణించి వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీని వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఓ చానెల్‌తో మాట్లాడిన జావెద్ బాబర్ ఆజామ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

బాబర్‌ను చూసి కోహ్లీ..

బాబర్‌ను చూసి కోహ్లీ..

'బాబర్ ఆజామ్ కన్నా విరాట్ కోహ్లీ బెటర్ రేంజ్ షాట్స్ ఆడగలడు. కానీ అతనికి ఓ బలహీనత ఉంది. స్వింగ్ బాల్స్‌కు అతను తడబడుతాడు. సులువుగా ఆఫ్ స్టంప్ వికెట్‌ను పారేసుకుంటాడు. ఇంగ్లండ్ పర్యటనలో జేమ్స్ అండర్సన్ ఈ బంతులతోనే కోహ్లీని ఇబ్బంది పెట్లాడు. అయితే బాబర్ ఆజామ్‌కు మాత్రం సచిన్ టెండూల్కర్‌లా ఇలాంటి బలహీనతలేం లేవు. టెక్నికల్‌గా బాబర్ చాలా సేఫ్. కానీ అతను ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీని ఫాలో అవ్వాలి. అప్పుడు అతను మరింత గొప్ప ఆటగాడవుతాడు. అలాగే బాబర్‌ను చూసి విరాట్ తన టెక్నిక్ విక్‌నెస్‌ను అధిగమించాలి. 'అని అకిబ్ సూచించాడు.

పాక్ చాలా లక్కీ..

పాక్ చాలా లక్కీ..

పాకిస్థాన్ జట్టు చాలా లక్కీ అని, బాబర్ ఆజామ్ వంటి ఆటగాళ్లు టీమ్‌లో ఉండటం అదృష్టమని ఈ మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. అతను టీమ్‌ బ్యాటింగ్ విభాగంలో 50 శాతం అతనే రాణిస్తున్నాడని, ఒంటిచేత్తో జట్టును సరైన ట్రాక్‌లో నిలిపాడని కొనియాడాడు. 'గత రెండు మూడేళ్లుగా పాకిస్థాన్ బ్యాటింగ్‌ బాధ్యతల్లో 50 శాతం బాబర్ ఆజామ్‌దే పాత్ర. అతను ఇంత నిలకడగా ఆడుతూ వన్డే ర్యాకింగ్స్‌లో విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టుతాడని అస్సలు ఊహించలేదు. పాకిస్థాన్ చాలా లక్కీ. కష్టాల్లో ఉన్నప్పుడు టీమ్‌లోకి వచ్చిన బాబర్.. ఒంటి చేత్తో జట్టును సరైన ట్రాక్‌లోకి తీసుకొచ్చాడు. కెప్టెన్సీ కూడా అతని ఫామ్‌ను ప్రభావం చేయలేదు'అని అకిబ్ కొనియాడాడు.

బోణీ కొట్టిన విరాట్..

బోణీ కొట్టిన విరాట్..

ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ..తన టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభాన్ని అందించాడు. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను మట్టి కరిపించి లీగ్‌లో బోణీ కొట్టాడు. శుక్రవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్లతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 రన్స్ చేయగా.. ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసి ఆఖరి బంతికి విజయాన్నందుకుంది. చేజింగ్‌లో తడబడిన ఆర్‌సీబీకి ఏబీ డివిలియర్స్(48) సూపర్ బ్యాటింగ్‌తో విజయాన్నందించాడు.

Story first published: Sunday, April 11, 2021, 18:48 [IST]
Other articles published on Apr 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+