న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs MI: చిక్కుల్లో రోహిత్ శర్మ.. అంపైర్‌పై దుర్భాషలాడిన హిట్‌మ్యాన్! (వీడియో)

IPL 2021: Rohit Sharma risks IPL Code of Conduct breach after frustrated on-field umpire’s decision
IPL 2021:Rohit Sharma Takes A Nasty Jibe At Umpire ఇప్పటికే రూ.12 లక్షల జరిమానా..!| Oneindia Telugu

చెన్నై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించి చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో తన ఔట్ విషయంలో అంపైర్ షంషుద్దీన్ తప్పుడు నిర్ణయం ప్రకటించడంతో సహనం కోల్పోయిన రోహిత్ శర్మ నోటికి పనిచెప్పాడు. చేతితో సైగలు చేస్తూ అంపైర్‌పై దుర్భాషలాడాడు. రోహిత్ తీరుపట్ల షంషుద్దీన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుండగా.. రోహిత్ శర్మపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అసలేం జరిగిందంటే..?

ముంబై ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌‌లో మొయిసెస్ హెన్రీక్స్ వేసిన లెగ్ సైడ్ బంతిని హిట్‌మ్యాన్ ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌ను మిస్సై కీపర్ రాహుల్ చేతిలో పడింది. దాంతో ఫీల్డింగ్ టీమ్ అప్పీల్ చేయగా.. అంపైర్ షంషుద్దీన్ ఔటిచ్చాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన రోహిత్.. రివ్యూ తీసుకుంటూనే అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. చేతితో సైగలు చేస్తూ దుర్భశలాడాడు. దీనిపై అంపైర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ ప్రకటించాడు.

రూల్స్ ప్రకారం..

రూల్స్ ప్రకారం..

ఐపీఎల్ నిబంధనల ప్రకారం అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం రూల్స్‌ను అతిక్రమించడమే. అంపైర్‌ది తప్పుడు నిర్ణయం అయినా ఆటగాళ్లు వ్యతిరేకత వ్యక్తం చేయవద్దు. రివ్యూలో అంపైర్‌ది తప్పిదమని స్పష్టమైన ఈ అభియోగంలో ఆటగాడికి ఎలాంటి మినహాయింపు ఉండదు. ఈ లెక్కన రోహిత్ శర్మపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే అంపైర్ షంషుద్దీన్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశాడా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే స్లో ఓవర్‌రేట్ కారణంగా రోహిత్ రూ.12 లక్షల జరిమానాకు గురైన విషయం తెలిసిందే.

PBKS vs MI trolls: ఫైవ్ టైమ్ చాంపియన్స్ అనే గర్వం తలకెక్కింది.. మెచ్చుకుంటే ఇచ్చుకపోతున్నారు!

మెరిసిన రాహుల్, గేల్

మెరిసిన రాహుల్, గేల్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(2/21), రవి బిష్ణోయ్(2/21) రెండేసి వికెట్లు తీయగా.. దీపక్ హుడా, అర్ష‌దీప్ సింగ్ తలో వికెట్ తీశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. కేఎల్ రాహుల్(52 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 నాటౌట్), క్రిస్ గేల్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్) రాణించారు.

Story first published: Saturday, April 24, 2021, 12:17 [IST]
Other articles published on Apr 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X