DC vs SRH: సన్‌రైజర్స్‌కు ఢిల్లీ గండం! జట్టులోకి మరో పేసర్! జోరు కొనసాగెనా? తుది జట్లు ఇవే!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో పోరుకు సిద్ధమైంది. హ్యాట్రిక్ పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందిన హైదరాబాద్... నేడు(ఆదివారం) జరిగే డబుల్ హెడర్ సెకండ్ మ్యాచ్‌లో చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బంతితో, బ్యాట్‌తో మెరిసి తొలి విజయాన్ని అందుకున్న వార్నర్ బృందం అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచిన ఢిల్లీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పంత్ సేన చాలా పటిష్టంగా కనబడుతోంది.
అయితే, ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చెపాక్ వికెట్ ఈ మ్యాచ్‌లో ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. చెన్నై వేదికగా ఈ సీజన్‌లో ఇప్పటిదాకా తొమ్మిది మ్యాచ్‌లు జరగ్గా కేవలం రెండు సార్లే 170 కంటే ఎక్కువ స్కోరు రికార్డ్ అయ్యింది. సన్‌రైజర్స్, క్యాపిటల్స్ పోరుతో చెన్నైలో మ్యాచ్‌లు ముగుస్తాయి. దాంతో ఈ మ్యాచ్‌కు బ్యాటింగ్ ట్రాక్ సిద్దం చేస్తారా? లేక ఎప్పటిలానే టర్న్ పిచ్ అందిస్తారా? అనేది చూడాలి.

ఆశలన్నీ ఫారీనర్స్‌పైనే
బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసురుతున్న చెపాక్ స్లో వికెట్‌ను అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌కు నాలుగు మ్యాచ్‌లు అవసరమయ్యాయి. ఇక, జట్టు విషయానికొస్తే కేన్ విలియమ్సన్ ఎంట్రీతో లైనప్‌లో బ్యాలెన్స్ పెరిగింది. ఇండియా కుర్రాళ్లు అంచనాలు అందుకోవడంలో ఫెయిలవడంతో బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ డేవిడ్ వార్నర్, విలియమ్సన్, బెయిర్ స్టో పైనే ఉండనుంది.
అయితే బౌలర్ల గాయాలు హైదరాబాద్‌ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే మోకాలి గాయంతో నటరాజన్ ఐపీఎల్ నుంచి తప్పుకోగా... తొడ కండరాలు పట్టేయడంతో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ మధ్యలోనే పేసర్ భువనేశ్వర్ కుమార్ మైదానం వీడాడు. ఆ మ్యాచ్‌లో అతడు తన పూర్తి కోటా ఓవర్లను వేయలేదు. దాంతో భువనేశ్వర్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేది అనుమానమే.
హైదరాబాద్‌కు నమ్మకమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న రషీద్ ఖాన్ ఈ సీజన్‌లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ ఖలీల్ అహ్మద్, ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మలు బౌలింగ్‌లో సత్తా చాటారు. ఒకవేళ భువీకి విశ్రాంతినిస్తే సందీప్ శర్మకు చోటు దక్కవచ్చు.

పటిష్టంగా ఢిల్లీ..
ఇక, సన్‌రైజర్స్‌తో పోలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది. బ్యాట్స్‌మెన్ అంతా టచ్‌లో ఉన్నారు. ముఖ్యంగా ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధవన్ సూపర్ ఫామ్‌లో ఉండటం వారికి బాగా కలిసొస్తుంది. ఢిల్లీ జట్టులో శిఖర్ ధావన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కెప్టెన్ రిషభ్ పంత్, స్టీవ్ స్మిత్, హెట్‌మైర్, స్టొయినిస్‌లతో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ఇక, చెపాక్ స్లో వికెట్‌పై స్పిన్నర్లు అశ్విన్, అమిత్ మిశ్రా కీలకం కానున్నారు. రబడా, అవేశ్ ఖాన్‌లతో పేస్ విభాగం పటిష్టంగా ఉంది. కరోనా నుంచి కోలుకున్న అక్షర్ పటేల్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవచ్చు.

హైదరాబాద్‌దే పై చేయి..
ముఖాముఖి పోరులో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లు జరగ్గా... హైదరాబాద్ 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఢిల్లీ ఏడింటిలో గెలిచింది. గత సీజన్‌లో రెండింటికి రెండు మ్యాచ్‌లు హైదరాబాదే గెలుపొందింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌పై రషీద్‌కు మంచి రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య మినీ వార్ ఖాయమని భావిస్తున్నారు. డేవిడ్ వార్నర్(450), కేన్ విలియమ్సన్(405) మెరుగైన రికార్డుంది.

తుది జట్లు: (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రిషభ్ పంత్(కెప్టెన్/కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్‌మైర్, లలిత్ యాదవ్, అశ్విన్, కగిసో రబడా/క్రిస్ వోక్స్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో(కీపర్), కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్/సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్
డ్రీమ్ 11 ప్రిడిక్షన్: జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్( వైస్ కెప్టెన్), రిషభ్ పంత్, కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, లలిత్ యాదవ్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
Happy Birthday Sachin Tendulkar: ఏడారిలో పరుగుల తుఫాన్ .. బర్తేడే రోజు ఆస్ట్రేలియాను మాములుగా ఆడుకోలేదు!