
స్వల్ప మార్పులు చేసుకున్నా..
ఇప్పుడు ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన పృథ్వీ తాజాగా మీడియాతో మాట్లాడాడు. తన బ్యాటింగ్‌లో స్వల్ప మార్పులు చేసుకున్నానని తెలిపాడు. 'ఐపీఎల్ కన్నా ముందు నా బ్యాటింగ్‌లో స్వల్ప మార్పులు చేసుకున్నా. నా తప్పిదాల్ని పూర్తిగా సరిదిద్దుకోవాలని నిశ్చయించుకొని, అందుకోసం బాగా కష్టపడ్డా. రెండు వారాల పాటు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ రజినీకాంత్ సర్, బ్యాటింగ్ కోచ్ ప్రవీణ్ ఆమ్రె సర్ వద్ద శిక్షణ తీసుకున్నా. అలా నా బ్యాటింగ్‌లో కొన్ని మార్పులు చేసుకొని విజయ్ హజారే ట్రోఫీలో ఆడాను' అని చెప్పుకొచ్చాడు.

చివరి వరకు ఉండాల్సింది
ఇక చెన్నై మ్యాచ్‌పై స్పందించిన అతడు తన ఆట పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. 190 పరుగుల భారీ స్కోర్ ఛేదించేటప్పుడు శుభారంభం దక్కకపోతే విజయం అంత తేలిక కాదన్నాడు. అయితే, తాను ఈ మ్యాచ్‌లో చివరి వరకు ఉండాల్సిందని చెప్పాడు. 'చెన్నైతో మ్యాచ్‌లో రాణించడం సంతోషాన్నించింది. కాకపోతే చివరి వరకు ఉండాల్సింది. నా పెర్ఫామెన్స్‌కు రేటింగ్ ఇచ్చుకోవాలంటే.. 8/10 రేటింగ్ ఇచ్చుకుంటాను.'అని తెలిపాడు.

పంత్ ఎంటర్‌టైనర్..
ఇక ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ గురించి మాట్లాడుతూ.. ఆసీస్ దిగ్గజం చాలాకాలం క్రికెట్ ఆడాడని, తన అనుభవాన్ని మొత్తం యువకులతో పంచుకోవచ్చని చెప్పాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా పాంటింగ్‌తో బ్యాటింగ్ మెళకువలు చర్చిస్తానని పృథ్వీ అన్నాడు. ఇక కొత్త కెప్టెన్ రిషభ్ పంత్‌పై స్పందిస్తూ.. అతడు చాలా తెలివిగల ఆటగాడని మెచ్చుకున్నాడు. భయం లేకుండా ఆడతాడని, మైదానంలో ఆటగాడిగా ఎంటర్‌టైన్ చేస్తూనే కెప్టెన్‌గా ప్రశాంతంగా ఉంటాడని తెలిపాడు. తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేని సమయంలో ఢిల్లీని అద్భుతంగా నడిపిస్తున్నాడని కితాబిచ్చాడు.
దూల్‌పేట్ డేవిడ్ .. కూకట్ పల్లి కేన్ .. నాచారం నట్టూ.. జోగిపేట్ జాదవ్.. నెట్టింట పేలుతున్న మీమ్స్!

ఢిల్లీ బోణీ..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా (36 బంతుల్లో 54; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మొయిన్ అలీ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్యామ్ కరన్ (15 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. వోక్స్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం ఢిల్లీ 18.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (54 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), పృథ్వీ షా (38 బంతుల్లో 72; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు.


Click it and Unblock the Notifications
