
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) 2021 సీజన్ షూరు కావడంతో జనాలంతా ఈ ధనాధన్ లీగ్ జపం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ముంబై-ఆర్‌సీబీ, చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌లు కూడా బంపర్ హిట్ అవ్వడంతో పాటు ఫ్యాన్స్‌కు కావాల్సిన మజా అందించాయి. దాంతో యావత్ దేశం ఈ క్యాష్ రిచ్ లీగ్ మత్తులో ఊగిపోతుంది. ఇక నేడు తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరికొద్దిగంటల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ప్రారంభమయ్యే మ్యాచ్‌తో ఈ సీజన్‌ను ప్రారంభించనుంది. దాంతో తెలుగు ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీ జపం చేస్తున్నారు.
ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా వేదికగా ఎవరిని కదలించినా ఐపీఎల్ ముచ్చటే. సన్‌రైజర్స్ టీమ్ సంగతే. ఎవరి స్టేటస్ చూసినా అదే. ఇక మీమర్స్ అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్‌తో పండుగ చేసుకుంటున్నారు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సభ్యులను ఉద్దేశించి ఓ తెలుగు మీమర్ చేసిన మీమ్ అందరిని ఆకట్టుకుంటుంది. తెలుగు అభిమానులకు ముఖ్యంగా హైదరాబాద్ ఫ్యాన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. జట్టులోని కీలక ఆటగాళ్లకు హైదరాబాద్‌లోని నగరాల పేర్లను నిక్‌నేమ్‌గా పెడుతూ చేసిన ఆ మీమ్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఆ మీమ్‌లో ఏముందంటే.. 'దూల్ పేట్ డేవిడ్ భాయ్(డేవిడ్ వార్నర్), కూకట్ పల్లి కేన్, బాలనగర్ బెయిర్ స్టో, రామ్ నగర్ రాయ్(జాసన్ రాయ్), జోగిపేట్ జాదవ్(కేదార్ జాదవ్), మాదాపూర్ మనీష్(మనీష్ పాండే), అమీర్ పేట్ అబ్దుల్(అబ్దుల్ సమద్), హకీంపేట్ హోల్డర్, షేక్‌పేట్ శంకర్, రామ్‌నగర్ రషీద్ భాయ్, నాచారం నట్టూ, బోరబండా భువీ, సనత్ నగర్ సందీప్, కొంపల్లి కౌల్'అని ఉంది. దీన్ని అన్‌ఫ్రొఫేనల్ గ్యాంగ్ అనే మీమర్ రూపొందించాడు. చాలా ఇన్నోవేటివ్‌గా ఉన్న ఈ మీమ్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
గత సీజన్‌లో మూడో ప్లేస్‌తో ముగించిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం టోర్నీని విజయంతో మొదలుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైటర్స్ కూడా గత సీజన్‌లో తమ ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసిన హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. ఇరు జట్లలో స్టార్లకు కొదవలేకపోవడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.