IPL 2021: చెన్నైలో అడుగుపెట్టిన ధోనీ.. సీఎస్‌కే ప్రిపరేషన్స్ షురూ (వీడియో)

చెన్నై: కరోనాతో అర్థంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2021 రెండో దశ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా లీగ్ నిర్వహణకు సంబంధించిన సన్నాహాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి( BCCI) మొదలుపెట్టింది. షెడ్యూల్ కూడా ప్రకటించింది.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ లెక్కన ఈ మెగా లీగ్ ప్రారంభమవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్(CSK)మాత్రం అప్పుడే సన్నాహాలు ప్రారంభించింది. ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం చెన్నైలో అడుగుపెట్టాడు.
సీఎస్‌కే దుబాయ్ పయనం..
మెగా లీగ్‌కు ముందే ఆ జట్టు ప్రిపరేషన్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అన్ని జట్ల కన్నా ముందుగా యూఏఈ వెళ్లనున్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లో చెన్నై ఆటగాళ్లంతా యూఏఈ ఫ్లైట్ ఎక్కనున్నారని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఆ క్రమంలోనే రాంచీ నుంచి ధోనీ చెన్నై వచ్చాడని చెబుతున్నారు. ఇక చెన్నై ఎయిర్ పోర్ట్‌లో అడుగుపెట్టిన ధోనీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ధోనీ మాస్క్ పెట్టుకొని ముందుకు నడుస్తుండగా ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. తాల అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఇక ధోనీని అక్కడి ఫ్యాన్స్ తాల అని పిలుస్తారనే విషయం తెలిసిందే.
IND vs Eng: పుజారా ఔట్.. విహారికి చాన్స్! రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే!

కలిసిరాని యూఏఈ..
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ప్లే ఆఫ్ చేరకుండా నిష్క్రమించింది. సురేశ్ రైనా గైర్హాజరీ, సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం, కరోనా కలవరం ఆ జట్టు కొంపముంచింది. ఈ అనుభవంతో ఐపీఎల్ 2021కు పకడ్బందీగా ప్రిపేర్ అయిన ధోనీ సేన.. వేలంలో ఆటగాళ్లను ఆచితూచి తీసుకుంది.
భారత్ వేదికగా జరిగిన తొలి దశ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. లీగ్ అర్థంతరంగా ఆగిపోయే సమయానికి రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ధోనీ కెప్టెన్సీ అందరిని ఆకట్టుకుంది. మొయిన్ అలీ, సామ్ కరన్‌లను అతను వాడుకున్న విధానం జట్టుకు కలిసొచ్చింది.

ధోనీ కోసం టైటిల్..
ధోనీ కోసమైనా ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ గెలవాలని చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. చిన్న తాలగా పరిగణించే రైనా.. సీఎస్‌కేతో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో గత సీజన్‌కు దూరమైనా.. ఈ సారి బరిలోకి దిగాడు. 'ఎప్పుడైతే దుబాయ్‌లో అడుగపెడుతామో.. ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభిస్తామో ఆ క్షణమే ధోనీ కోసం మరో టైటిల్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం. అతని కెప్టెన్సీతో మా ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ఇతరుల సక్సెస్‌ను ధోనీ ఆస్వాదిస్తాడు. ప్లేయర్లందరికీ స్వేచ్చనిస్తాడు.
మొయిన్ అలీ, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, రుతురాజ్ అందరూ స్వేచ్చగా ఆడుతున్నారంటే దానికి కారణం ధోనీ. టైటిల్ గెలిచేందుకు మాకు మంచి అవకాశం ఉంది. ధోనీ కోసమైనా కచ్చితంగా గెలుస్తాం. 'అని రైనా చెప్పుకొచ్చాడు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టైటిల్ గెలవాలని ఆ జట్టు భావిస్తోంది.

కఠిన ఆంక్షలు..
ఐపీఎల్ 2021 ఫేస్ 2కు సంబంధించి 41 పేజీలతో కూడిన బయో బబుల్ ప్రొటోకాల్స్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌లో కథనం ప్రకారం, ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్‌లోకి సిక్స్‌గా బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించరు. ఆ బంతి స్థానంలో కొత్త బంతిని తీసుకొస్తారు. మైదానం ఆవల పడే బంతులను ఇతరులు పట్టుకునే అవకాశం ఉన్నందున.. తిరిగి అదే బంతిని వాడితే కరోనా సోకే ప్రమాదం ఉన్నది. అందుకని స్టాండ్‌కు వెళ్లే బంతిని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత బాల్ లైబ్రరీలో దాచనున్నారు. ఈసారి ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications