
ఈసారి ఐదుగురితో..
ఇందులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించాలనే ప్రతిపాదన అతి ముఖ్యమైనది. ప్రస్తుతం తుది 11 మంది ఆటగాళ్లలో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ కొంతకాలంగా ఆయా ఫ్రాంచైజీలు ఈ విషయంలో సడలింపులు ఉండాలని కోరుతున్నాయి. తాజాగా కొత్త జట్టు రాబోతుందనే ప్రచార నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఈ డిమాండ్ బీసీసీఐ ముందు గట్టిగా వినిపిస్తున్నాయి. ఫ్రాంచైజీల నుంచి ఒత్తిడి వస్తే బోర్డు సరైన సమయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే కొత్త జట్టు చేరికతో కొన్ని రూల్స్ కూడా మారవచ్చని తెలిపాడు.

రెండు గ్రూపులుగా:
వచ్చే ఏడాది ఐపీఎల్ జట్ల సంఖ్య 8కి బదులుగా 9-10 ఉంటే ఇప్పటిలా రౌండ్ రాబిన్‌లో కాకుండా రెండు గ్రూపులుగా వరల్డ్ కప్ ఫార్మాట్‌లో ఆడించే అవకాశం ఉంటుంది. మ్యాచ్‌ల్లో మరింత పోటీతత్వం తీసుకొచ్చేందుకు తుది జట్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్యను ఐదుకు పెంచవచ్చు. ఇదే విషయాన్ని పలు ఫ్రాంచైజీలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి.

పవర్ సర్జ్..
ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో కొత్త నిబంధనలు తీసుకువస్తున్నారు. వీటిలో పవర్ సర్జ్, ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్నాయి. వచ్చే ఐపీఎల్‌లో కూడా ఈ రెండింటిని అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో లీగ్ పాలక మండలి ఉన్నట్టు సమాచారం. 11వ ఓవర్ తర్వాత ఏ సమయంలోనైనా బ్యాటింగ్ జట్టు రెండు ఓవర్ల పాటు పవర్ సర్జ్ తీసుకోవచ్చు. ఈ సమయంలో పవర్‌ప్లే మాదిరే 30 గజాల ఔట్‌సైడ్ సర్కిల్‌లో ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. అలాగే ఎక్స్ ఫ్యాక్టర్ రూల్‌లో భాగంగా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసేలా మార్పు తీసుకురావచ్చు.
India vs Australia: ఆస్ట్రేలియాతో వన్డేలకు 28 ఏళ్ల నాటి జెర్సీలు!


Click it and Unblock the Notifications












