
అంచనాలకు మించి..
అయితే ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా అవకాశం దక్కించుకున్న అవేశ్ ఖాన్ అంచనాలకు మించి రాణించాడు. కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్ గైర్హాజరీ నేపథ్యంలో అవకాశం దక్కించుకున్న అవేశ్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జట్టులో సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ ఉన్నా.. నయా కెప్టెన్ రిషభ్ పంత్ ఈ యువ పేసర్‌పై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చాడు.
దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్మురేపిన అవేశ్ ఖాన్.. కేవలం ఐదు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తూ.. చెన్నై స్టార్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డుప్లెసిస్, మహేంద్ర సింగ్ ధోనీ వికెట్లను తీసి పంత్ నమ్మకాన్ని నిలబెట్టాడు.

ఇట్స్ మై డ్రీమ్..
ఈ నేపథ్యంలోనే తాజాగా ధోనీ వికెట్ తీయడంపై స్పందించిన అవేశ్ ఖాన్ అది తన డ్రీమ్ అని, ఇన్నాళ్లకు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. 'మూడేళ్ల క్రితం 2018లో మహీ భాయ్ వికెట్ తీసే అవకాశం వచ్చింది. కానీ కొలిన్ మున్రో క్యాచ్ డ్రాప్ చేయడంతో నిరాశే ఎదురైంది. మహీ భాయ్ వికెట్ తీయాలన్న నా కల అలాగే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు.. మూడు సంవత్సరాల తర్వాత అది నెరవేరింది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.''అని ఢిల్లీ క్యాపిటల్స్ మీడియా టీమ్‌తో మాట్లాడుతూ అవేశ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశాడు.

అదే వ్యూహంతో..
ఇక ధోనీ భాయ్ కొన్నాళ్లు క్రికెట్ ఆడకపోవడం కూడా తనకు కలిసొచ్చిందన్నాడు. 'మహీ భాయ్ కొన్ని రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మ్యాచ్‌లు ఆడలేదు. కాబట్టి అతనిపై ఒత్తిడి మరింతగా పెంచి, వికెట్ తీయాలని ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రచించింది. వాటిని నేను సమర్థవంతంగా అమలు చేయగలిగాను'అని ధోనీని ఔట్ చేయడం వెనుక ఉన్న వ్యూహాల గురించి అవేశ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొన్న ధోని, పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. బంతిని తప్పుగా అంచనా వేసిన మహీ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 15న రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది.
RR vs PBKS: నేడు పంజాబ్ గెలుస్తుందని ఆకాశ్ చోప్రా చెప్పాడుగా.. ఇక రాజస్థాన్ రాయల్స్ గెలిచినట్టే!


Click it and Unblock the Notifications
