For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs PBKS: నేడు పంజాబ్ గెలుస్తుందని ఆకాశ్ చోప్రా చెప్పాడుగా.. ఇక రాజస్థాన్ రాయల్స్ గెలిచినట్టే!

Aakash Chopra IPL 2021 Prediction Trolls: Will Punjab Win Today?

న్యూఢిల్లీ: ప్రముఖ కామెంటేటర్, టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఐపీఎల్ ప్రిడిక్షన్స్‌పై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించిన అనాలసిస్, ప్రిడిక్షన్స్‌ను ఈ మాజీ ఓపెనర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరికొద్ది సేపట్లో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ మధ్య ప్రారంభం కానున్న నేటి మ్యాచ్ ఫలితాన్ని కూడా అంచనా వేశాడు. అయితే చోప్రా ప్రిడిక్షన్‌పై నెటిజన్లు వ్యంగ్రాస్త్రాలు సంధిస్తున్నారు. చోప్రా చెప్పాడంటే అది కచ్చితంగా జరగదని కామెంట్ చేస్తున్నారు.

ఇంతకీ ఏం చెప్పాడంటే..

రాజస్థాన్-పంజాబ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ చేస్తుందని ఆకాశ్ చోప్రా తెలిపాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో మొత్తం 12 సిక్స్‌లు నమోదవుతాయన్నాడు. ఇక ఇరు జట్లలో నాలుగో స్థానంలో వచ్చే బ్యాట్స్‌మన్ 30+ రన్స్ చేస్తారన్నాడు. అంతేకాకుండా కేఎల్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్.. సంజూశాంసన్ సారథ్యంలోని రాజస్థాన్‌ను ఓడిస్తుందని మ్యాచ్ ఫలితాన్ని కూడా చెప్పేశాడు. అయితే నెటిజన్లు మాత్రం ఆకాశ్ చోప్రా చెప్పింది ఏది జరగదని కామెంట్ చేస్తున్నారు. అతను పంజాబ్ గెలుస్తుందని అంటున్నాడంటే.. ఈ రోజు మ్యాచ్‌లో రాస్థాన్ విజయం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు.

గత మూడు మ్యాచ్‌ల్లో..

ఇప్పటి వరకు ఈ సీజన్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఆకాశ్ చోప్రా చెప్పిన ప్రిడిక్షన్స్ తప్పయ్యాయని కామెంట్ చేస్తున్నారు. ఆర్‌సీబీ X ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధిస్తుందని ఆకాశ్ చోప్రా చెప్పగా.. ఆర్‌సీబీ విజయాన్నందుకుంది. ఢిల్లీ-చెన్నై మ్యాచ్‌లో ధోనీ సేనకు విజయం దక్కుతుందని చెప్పగా.. ఢిల్లీ గెలుపొందింది. ఇక ఆదివారం జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధిస్తుందని అంచనా వేయగా.. కేకేఆర్ బోణీ కొట్టింది. ఈ మూడు ప్రిడిక్షన్ తప్పిదం కావడంతో తాజా అంచనా కూడా తలకిందులవుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ ట్రెండ్ కొనసాగితే..

ఈ ట్రెండ్ కొనసాగితే..

ఇప్పటి వరకు చెప్పిన ప్రిడిక్షన్స్ అన్ని తలకిందులయ్యాయని ఓ నెటిజన్ చోప్రా ప్రశ్నించగా.. అతను చాలా తెలివిగా, సదరాగా బదులిచ్చాడు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే ఆయా జట్లన్నీ తమ జట్టు గెలుస్తుందని చెప్పవద్దని తనను వేడుకుంటాయని, కావాల్సినవి కూడా ఆఫర్ చేస్తాయన్నాడు. అందుకే ఈ ఇంక్రిడిబుల్ ప్రీమియర్ లీగ్ అంటే ఇష్టమని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం చోప్రా ప్రిడిక్షన్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి మనీష్ పాండే స్లో బ్యాటింగే కారణమని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అతను మరింత ధాటిగా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు.

Mumbai Indians ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఆ స్టార్ ప్లేయర్ రెడీ!

రాజస్థాన్ X పంజాబ్..

రాజస్థాన్ X పంజాబ్..

రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్.. ఈ రెండు జట్లలో బిగ్ హిట్టర్లకు కొదువలేదు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న ప్లేయర్లకు తక్కువ లేదు. కానీ గ్రౌండ్‌లో నిలకడగా ఆడటంలోనే ఈ రెండు జట్లు ఎప్పుడు ఏదో ఓ మిస్టేక్ చేస్తూనే ఉన్నాయి. దీంతో ఇంతవరకు ఐపీఎల్‌లో తమ మార్క్‌ను చూపెట్టలేకపోయాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌కు రెడీ అయ్యాయి. ఇప్పటి వరకూ పంజాబ్, రాజస్థాన్ ముఖా ముఖి పరిశీలిస్తే.. 21 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 9 మ్యాచ్‌ల్లో పంజాబ్ విజయం సాధించింది.

Story first published: Monday, April 12, 2021, 17:19 [IST]
Other articles published on Apr 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+