
భయపడ్డ అంపైర్..
మహీ ఆగ్రహానికి భయపడ్డ అంపైర్ పాల్ రీఫెల్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అయితే అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంపై డగౌట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో ఫలితం ఆఖర్లో వన్ సైడ్ కావడంతో ఈ తప్పిదాన్ని పట్టించుకోలేదు. కానీ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగితే పరిస్థితి మరోలా ఉండేది. ఇక మహీ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. అంపైర్‌ను భయపెట్టాడని ట్రోలింగ్‌కు దిగారు.
ప్రణాళిక ప్రకారం ఔట్ చేసి..
ఇక అంతకు ముందు కర్ణ్ శర్మపై కూడా ధోనీ అసహనం వ్యక్తం చేశాడు. 18వ ఓవర్‌ను కర్ణ్ శర్మతో వేయించిన ధోనీ.. తాను అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. క్రీజులో సెటిల్ అయిన కేన్ విలియమ్సన్‌ను టెంప్ట్ చేసి ఔట్ చేశాడు. ఈ ఓవర్‌లో తొలి బంతిని బౌండరీ తరలించిన విలియమ్సన్.. ఆ మరుసటి బంతికే లాంగాన్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కర్ణ్ శర్మ లైన్ తప్పాడు. తరువాతి నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ ఇచ్చాడు. మూడో బంతిని శర్మ ఫుల్ టాస్ వేయడంతో రషీద్ భారీ సిక్సర్ కొట్టాడు.

ఫీల్డింగ్ ఎక్కడుంది..?
ఆ వెంటనే స్వీప్ షాట్ ఆడిన రషీద్ ఖాన్ మరో బౌండరీ రాబట్టాడు. అనంతరం సింగిల్ తీసి నదీమ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఈ బంతికి ముందు ధోనీ కొన్ని సూచనలు కూడా చేశాడు. కానీ అదిపట్టించుకోని కర్ణ్ శర్మ.. ఔట్ ఆఫ్ స్టంప్ వేయడంతో నదీమ్ బౌండరీ రాబట్టాడు. అయితే బంతి వేసే సమయంలోనే ఆ బాల్ వద్దు అని ధోనీ గట్టిగా అరిచాడు. అనంతరం ఫీల్డింగ్ ఎక్కడ పెట్టినా.. బాల్ ఎలా వేస్తున్నావని మందలించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

చెన్నై రీవేంజ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. షేన్ వాట్సన్(38 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 42), అంబటి రాయుడు (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41)తో పాటు చివర్లో ధోనీ(13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 21), రవీంద్ర జడేజా(10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 25 నాటౌట్) రాణించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులకే పరిమితమైంది. కేన్ విలియమ్సన్(39 బంతుల్లో 7 ఫోర్లు 57) మినహా అంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో కరన్ శర్మ, బ్రావో రెండేసి వికెట్లు తీయగా.. సామ్ కరన్, జడేజా, ఠాకుర్ తలో వికెట్ తీశారు.
మాకు ఏ ఆటగాడు వద్దు.. ప్లే ఆఫ్ చేరేందుకు ధోనీ దగ్గర ప్లాన్- బి ఉంది: సీఎస్‌కే సీఈవో


Click it and Unblock the Notifications












