మాకు ఏ ఆటగాడు వద్దు.. ప్లే ఆఫ్ చేరేందుకు ధోనీ దగ్గర ప్లాన్- బి ఉంది: సీఎస్‌కే సీఈవో

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తి కావడంతో మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ఓపెన్ అయ్యింది. దాంతో ఈ సీజన్‌లో అనూహ్యంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ సురేశ్ రైనా స్థానంలో ఓ బ్యాట్స్‌మన్‌ను తీసుకునే ప్రయత్నాలు చేస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. అంతేకాకుండా క్రికెట్ విశ్లేషకులు కూడా ఓ టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను తీసుకోవాలని సూచించారు. కానీ తమకు మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఏ ఆటగాడిని తీసుకునే ఉద్దేశం లేదని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. తమ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్లే ఆఫ్ చేరేందుకు ప్లాన్ బితో సిద్దంగా ఉన్నాడని తెలిపారు.

మాకు ఆ ఆలోచనే లేదు..
ఇక తామెప్పుడూ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఆటగాళ్లను కొనుగోలు చేయడం గానీ విక్రయించడం గానీ చేయలేదని సీఎస్‌కే సీఈవో అన్నారు. ‘అన్ని జట్లూ వేలం ద్వారా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ప్రణాళికల్లో భాగంగానే వేలంలో వారిని తీసుకుంటాయి. కాబట్టి ఏ జట్టు కూడా తమ అంతర్జాతీయ ఆటగాళ్లను ఇతర జట్లకు ఇస్తుందని అనుకోవడం లేదు. తుది జట్టులో కొందరికి చోటు దక్కి ఉండొచ్చు.. మరి కొందరికి ఆడే అవకాశం ఇంకా రాకపోవచ్చు. కానీ రకరకాల ప్రణాళికలు, పరిస్థితుల ఆధారంగానే ఇలా జరుగుతుంది. జట్లు కేవలం ఒకే ప్లాన్‌తో బరిలో దిగవని.. రకరకాల ప్రణాళికలతో ఆడుతుంటాయి'అని స్పష్టం చేశారు.

సెకండాఫ్‌లో తాహిర్‌కు చాన్స్..
గత సీజన్లో పర్పుల్ క్యాప్ సాధించిన ఇమ్రాన్ తాహిర్‌కు ఈ సీజన్‌లో ఇంకా అవకాశం దక్కలేదు. దాంతో తాహిర్‌ను కూడా బదిలీ చేస్తారేమో అనే ఊహాగానాలు వినిపించాయి. వాటిని కూడా విశ్వనాథన్ కొట్టిపారేశారు. సెకండాఫ్‌లో తాహీర్‌కు అవకాశం దక్కుతుందన్నారు. ‘తదుపరి మ్యాచ్‌ల్లో అతనికి అవకాశం దక్కుతుంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా విదేశీ ఆటగాళ్లలో ఇద్దరు టాపార్డర్ బ్యాట్స్‌మెన్.. మరో ఇద్దరు బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతున్నాం. దాంతో తాహిర్‌కు అవకాశం దక్కడం లేదు. ఇక సెకండాఫ్‌లో యూఏఈ పిచ్‌లు పూర్తిగా స్పిన్‌కు అనుకూలిస్తాయి. అప్పుడు అతను కీలకం కానున్నాడు.'అని సీఎస్‌కే సీఈవో చెప్పుకొచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్‌లో మరో ఇద్దరు ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఆడేందుకు అవకాశం ఉంది. కానీ తాము ఆ దిశగా ఆలోచించడం లేదని.. ఆటగాళ్ల బదిలీకి సంబంధించిన నిబంధనలు సైతం తమకు పూర్తిగా తెలియవన్నారు.

మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ అంటే..?
మిడ్ సీజన్ ట్రాన్స్‌పర్‌లో భాగంగా ఏ జట్టు అయినా తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను ఇతర జట్లకు విక్రయించుకోవచ్చు. అదేవిధంగా ఇతర జట్లు వదిలేసుకునే ఆటగాళ్ళను కొనుక్కోవచ్చు. అయితే జట్లలో ఉన్న అందరిని వదులుకోవడానికి, తీసుకోవడానికి వీలు ఉండదు. హాఫ్ సీజన్ ముగిసిన తర్వాత ఏడు మ్యాచ్‌లకుగానూ కేవలం ఒకటి లేదా రెండు మ్యాచులు ఆడినవాళ్ళను మాత్రమే అమ్మడానికి, తీసుకోవడానికి వీలుంటుంది. ఆటగాళ్ళు రెండుకంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడితే మాత్రం ఇది వర్తించదు.
గౌతమ్ గంభీర్‌కు కుల్దీప్ యాదవ్ బర్త్‌డే విషెస్.. దినేశ్ కార్తీక్‌పై అసంతృప్తే అంటున్న ఫ్యాన్స్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications