
ఫీల్డింగ్ ఎంచుకోవడం..
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన 19 మ్యాచ్‌ల్లో ఎక్కువ శాతం టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ ఎంచుకున్నాయి. కానీ ఫలితం మాత్రం తొలుత బ్యాటింగ్ చేసిన జట్లనే వరించింది. ముఖ్యంగా దుబాయ్ వేదికగా జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో ఒక్క సీఎస్‌కే, కింగ్స్ పంజాబ్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ మినహా తొలుత బ్యాటింగ్ చేసిన జట్లకే విజయం దక్కింది. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఛేజింగ్‌లో గెలవడాన్ని దృష్టిలో ఉంచుకున్న ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఛేజింగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై అందుకున్న విజయాన్నే రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. డ్యూ ప్రభావం ఉంటుందన్నాడు. కానీ ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కు కట్టడి చేస్తేనే ఈ అవకాశం ఉంటుందనే విషయాన్ని మర్చిపోయాడు. అది భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించి మూల్యం చెల్లించుకున్నాడు. ప్రతీ కెప్టెన్ డ్యూ ప్రభావం అంటున్నారు కానీ.. భారీ స్కోర్ నమోదైతే ఛేజింగ్‌లో ఒత్తిడి ఉంటుందనే లాజిక్‌ను మిస్సవుతున్నారు. టాస్ గెలిచిన ఆర్‌సీబీ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసుంటే ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది.

బౌలింగ్‌లో తేలిపోవడం..
ధాటైన ఇన్నింగ్స్‌తో పృథ్వీషా, శిఖర్ ధావన్ ఢిల్లీకి శుభారంభం అందించగా.. పవర్ ప్లే అనంతరం ఆర్‌సీబీ బౌలర్లు జూలి విధిల్చారు. హాఫ్ సెంచరీకి చేరువైన షాను హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చగా.. శిఖర్ ధావన్‌ను ఉడానా, అయ్యర్‌ను మొయిన్ అలీ ఔట్ చేశారు. వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పరుగుల వేగం తగ్గింది. ఈ మూమెంటమ్‌ను ఆర్‌సీబీ బౌలర్లు కొనసాగించలేకపోయారు. స్టోయినీస్, రిషభ్ పంత్ ధాటికి చేతులెత్తేసారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా నవదీప్ సైనీ తేలిపోయాడు. దాంతో పంత్-స్టోయినిస్ జోడీ 13 నుంచి 17 ఓవర్లలో 24 బంతుల్లోనే 59 పరుగులు చేసింది. ఇక సైనీ బౌలింగ్‌లో స్టోయినిస్ ఇచ్చిన క్యాచ్‌ను చాహల్ జారవిడచడం కూడా ఆర్‌సీబీని దెబ్బతీసింది. ఈ అవకాశంతో స్టోయినిస్ చెలరేగడంతో ఢిల్లీకి భారీ స్కోర్ చేసింది. ఆర్‌సీబీ బౌలర్లు ఢిల్లీని 180 పరుగుల లోపు కట్టడి చేసుంటే ఫలితం మరోలా ఉండేది.

పోరాడని బ్యాట్స్‌మెన్..
197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ కనీస పోరాట పటిమ కనబర్చకపోవడం ఓటమికి ప్రధాన కారణం. ఏ దశలోను బ్యాట్స్‌మెన్‌లో టార్గెట్ చేజ్ చేస్తామనే ఆత్మవిశ్వాసం కనిపించలేదు. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లను పారేసుకోవడంతోనే ఆర్‌సీబీ ఓటమి ఖాయమైంది. ఫించ్‌కు మూడు, నాలుగు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోకపోవడం.. చెత్త షాట్లతో పడిక్కల్, డివిలియర్స్ వెనుదిరగడం ఆర్‌సీబీ కొంప ముంచింది. విరాట్ పోరాడినా మరో ఎండ్‌లో సహకారం అందలేదు. ఇప్పటికే చెత్త రన్‌రేట్ ఉన్న ఆర్‌సీబీ కనీసం దాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయలేదు. ఓడినా గట్టి పోటినిస్తే రన్‌రేట్ తగ్గకుండా ఉండేది. కానీ బ్యాటింగ్ ఆర్డర్ పేకాల్లా కుప్పకూలడంతో 59 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలై రన్‌రేట్ మరింత అధ్వాన్నంగా మార్చుకుంది.


Click it and Unblock the Notifications

ఐసీసీ నిబంధనను అతిక్రమించిన విరాట్ కోహ్లీ










