IPL 2020: ధోనీ వివాదం.. వైడ్ బాల్స్‌కు రివ్యూ ఉండాలన్న కోహ్లీ!

దుబాయ్: వైడ్ బాల్స్‌కు కూడా రివ్యూ తీసుకునే అవకాశం ఇవ్వాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ డిమాండ్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ఓ వైడ్ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంపైర్ పాల్ రీఫెల్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేయగా అతను తన నిర్ణయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే.
అయితే టీవీ రిప్లేలో ఆ బంతి వైడ్ అని తేలడంతో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది. ధోనీపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా వైడ్స్ విషయంలో రివ్యూ అవకాశం ఇవ్వాలని విరాట్ సూచించాడు. అలాగే హై ఫుల్‌టాస్ బాల్స్‌కు కూడా ఇది వర్తించేలా చేయాలన్నాడు. ఇక కోహ్లీ ప్రతిపాదనతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఏకీభవించాడు.

హైఫుల్ టాస్ బాల్స్‌కు కూడా..
ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన కోహ్లీని.. ఏ నిబంధన టీ20 క్రికెట్‌ను మార్చుతుందనుకుంటున్నారు? అని ప్రశ్నించగా వైడ్ బాల్ రివ్యూ గురించి చెప్పుకొచ్చాడు.‘ఓ కెప్టెన్‌గా అంపైర్లు తప్పుగా ఇచ్చే వైడ్ బాల్స్, చాతి పైభాగానికి వచ్చే హై ఫుల్ టాస్ బాల్స్ విషయంలో రివ్యూ తీసుకునే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే గతంలో చాలా తప్పులు జరిగాయి. ఈ చిన్న తప్పులు ఐపీఎల్, ఇతర టీ20 క్రికెట్ టోర్నీల్లో ప్రభావం చూపుతాయి.'అని తెలిపాడు. ఇక కోహ్లీ ప్రతిపాదనకు రాహుల్ కూడా సై అన్నాడు. ‘ఈ రూల్ వస్తే చాలా బాగుంటుంది. జట్టుకు రెండు రివ్యూలు ఇస్తే సరిపోతుంది'అని చెప్పుకొచ్చాడు.

ధోనీ ఫైర్.. అంపైర్ యూటర్న్..
హైదరాబాద్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రషీద్‌ఖాన్ బ్యాటింగ్ చేయగా శార్దూల్‌ఠాకూర్ బౌలింగ్ వేశాడు. ఆ సమయంలో హైదరాబాద్‌కు 11 బంతుల్లో 25 పరుగులు కావాల్సి ఉంది. ఆ ఓవర్లో శార్దూల్ వేసిన వైడ్ యార్కర్ బంతిని అంపైర్ రీఫెల్.. వైడ్‌గా ప్రకటించబోయాడు. దాన్ని గమనించిన ధోనీ ఆ నిర్ణయాన్ని విభేదిస్తూ ముందుకొచ్చాడు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అంపైర్ చర్యపై డగౌట్‌లో ఉన్న వార్నర్ కూడా అసహనం వ్యక్తం చేశాడు.

ధోనీ తీరుపై విమర్శలు..
ధోనీ వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. చెన్నై సారథి అంపైర్‌ను బెదిరించి గెలిచాడని కొందరు.. మిస్టర్ కూల్ కూల్‌నెస్‌ను కోల్పోయాడని ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు. ధోనీ అరిస్తే.. కొన్నిసార్లు అంపైర్లు కూడా ఒత్తిడికి లోనవుతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సునీల్ గవాస్కర్, కెవిన్ పీటర్సన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'బంతి బ్యాట్‌ను తాకినట్లయితే.. క్యాచ్ అయ్యేది. కానీ నేరుగా ఎంఎస్ ధోనీకి వెళ్లింది' అని గవాస్కర్ అనగా.. 'అంపైర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నా' అని పీటర్సన్ పేర్కొన్నాడు.
Catch Of The Year: అచ్చం చేప పిల్లలానే డైవ్.. మైదానంలో కళ్లు చెదిరే విన్యాసం! (వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications