For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్‌కు భారీ స్కోర్ చేసే సత్తా లేదా? ఇప్పుడేం అంటావ్ సెహ్వాగ్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్!

 IPL 2020: Twitter trolls Virender Sehwag for his walkout statement against SRH

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ స్కోర్ చేసే సత్తాలేదని, ఆ జట్టు బ్యాటింగ్ సామర్థ్యం 150 పరుగులకే సరిపోతుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల ఆరెంజ్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం బౌలర్లు కూడా చెలరేగడంతో హైదరాబాద్ 69 పరుగులతో పంజాబ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపు విషయాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్ అభిమానులు సెహ్వాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఏ జట్టును తక్కువ అంచనా వేయవద్దని, నిన్నటి మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ సత్తా తెలిసిందా? అని చురుకలంటిస్తున్నారు.

అసలు విషయం ఎంటంటే..?

గత ఆదివారం షార్జా వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు సెహ్వాగ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జట్టుకు ధాటిగా ఆడే సత్తాలేదని, భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ ముందు తేలిపోతుందని అవహేళన చేశాడు. చిన్న మైదానమైన షార్జాలో మ్యాచ్ జరుగుతుండటం సన్‌రైజర్స్ ప్రతీకూలాంశమన్నాడు. ముంబై నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక సన్‌రైజర్స్ చేతులెత్తేస్తుందని ఎగతాళి చేశాడు. క్రిక్‌బజ్ రిపోర్టర్ గౌరవ్ కపూర్‌తో మాట్లాడుతూ సెహ్వాగ్ ఈ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. 'ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తేలిపోతుంది. ముంబైని ఢీకొట్టలేక చేతులెత్తేస్తుంది. ఎందుకంటే ఆ జట్టులో 200-250 పరుగులు చేయగల పవర్ హిట్టర్లు లేరు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సామర్థ్యం 150 పరుగులకే సరిపోతుంది. అదే ముంబై తొలుత బ్యాటింగ్ చేస్తే 200కు పైగా రన్స్ చేస్తుంది. ఇరు జట్లు సమతూకంగా లేకపోవడంతో మ్యాచ్ వన్‌సైడ్ కానుంది'అని సెహ్వాగ్ కామెంట్ చేశాడు.

ఇప్పుడేం అంటావ్ సెహ్వాగ్?

అయితే ఆ మ్యాచ్‌లో ముంబై 208 రన్స్ చేయగా.. హైదరాబాద్ 174 రన్స్‌కు పరిమితమైంది. కానీ సెహ్వాగ్ మ్యాచ్ వన్‌సైడ్ మాత్రం కాలేదు. విజయం కోసం ఆరెంజ్ ఆర్మీ శ్రమించింది. ఇక తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ చెలరేగడంతో అభిమానులు సెహ్వాగ్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడేం అంటావ్ సెహ్వాగ్.. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సత్తా తెలిసిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఫన్నీ మీమ్స్, కామెంట్స్, వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. మరొకసారి సన్‌రైజర్స్‌పై నోరు జారకుండా ఈ డాషింగ్ ఓపెనర్‌కు సోషల్ మీడియా వేదికగా బుద్ది చెబతున్నారు.

మీరంటే ఇష్టం..

ఇక ఓ అభిమాని అయితే.. ‘సెహ్వాగ్ సర్.. మీరన్నా.. మీ బ్యాటింగ్ అన్నా చాలా ఇష్టం. కానీ మీరు మా టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తక్కువ చేసి మాట్లాడటం చాలా బాధగా ఉంది. మీ మీద మాకున్న గౌరవాన్ని తగ్గిస్తుంది.'అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. మరో అభిమాని..‘సెహ్వాగ్ బ్యాటింగ్ ఇష్టపడేవాళ్లం. కానీ కామెంటేటర్‌గా, క్రికెటర్ల విశ్లేషకునిగా గుర్తింపు రావడం కోసం సెహ్వాగ్ చేస్తున్న వ్యాఖ్యలు చాలా కంపరంగా ఉన్నాయి. అతనిపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నాయి'అని మండిపడ్డాడు.

బెయిర్ ‘షో'.. పంజాబ్ ప్యాకప్

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' బెయిర్‌స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్‌ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్‌ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్‌ పూరన్‌ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్‌ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ ముగియడం పంజాబ్‌ వైఫల్యాన్ని సూచిస్తోంది.

RR vs DC: ఢిల్లీ స్పీడ్‌కు రాజస్థాన్ బ్రేక్ వేసేనా? సిక్సర్ల హోరులో గెలిచేదెవరు?

Story first published: Friday, October 9, 2020, 15:51 [IST]
Other articles published on Oct 9, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+