Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs DC: ఢిల్లీ స్పీడ్‌కు రాజస్థాన్ బ్రేక్ వేసేనా? సిక్సర్ల హోరులో గెలిచేదెవరు?

 IPL 2020, RR vs DC: Who will win Rajasthan Royals vs Delhi Capitals

షార్జా: ఐపీఎల్ 2020‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. చిన్న మైదానమైన షార్జా వేదికగా జరిగే ఈ సిక్స్ హిట్టింగ్ కాంటెస్ట్ అభిమానులను కనువిందు చేయనుంది. హ్యాట్రిక్ ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ బలమైన ప్రత్యర్థిని ఢీకొనేందుకు సిద్దమైంది. శుక్రవారం షార్జావేదికగా జరిగే లీగ్ మ్యాచ్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఐదు మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రెండింటిలోనే గెలిచింది.

ఈ రెండూ షార్జాలోనే కావడం గమనార్హం. దుబాయ్, అబుదాబిల్లో జరిగిన మ్యాచ్‌ల్లో రాయల్స్ ప్లేయర్లు అట్టర్ ఫ్లాపయ్యారు. దీంతో అచ్చొచ్చిన మైదానంలో అదరగొట్టేందుకు రాజస్థాన్ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. కానీ అది అనుకున్నంత సులువుకాదు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఢిల్లీ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ ఇప్పటికే ఐదింటిలో నాలుగు గెలిచి టేబుల్లో రెండో స్థానంలో ఉంది. అదే ఊపును కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయాన్నందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరి జెట్ స్పీడ్‌లా దూసుకెళ్తున్న ఢిల్లీకి రాజస్థాన్ బ్రేక్‌లు వేస్తుందా? లేక గత మ్యాచ్‌ల్లోలానే చేతులెత్తేస్తుందో చూడాలి!

 జట్టు ఎంపికలో గందరగోళం..

జట్టు ఎంపికలో గందరగోళం..

రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ తుది జట్టు ఎంపికలో ఇబ్బందులు పడుతూనే ఉంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ సడెన్‌గా ఫామ్ కోల్పోవడం ఆ జట్టును మరింత దెబ్బతీసింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, పేసర్ కార్తీక్ త్యాగి, అంకిత్ రాజ్‌పుత్‌ను టీమ్‌లోకి తీసుకున్నా ఆ జట్టు రాత మారలేదు. జోస్ బట్లర్ ఫామ్‌లోకి రావడం ఒక్కటే వారికి సానుకూలంశం. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, టామ్ కరన్ ఫర్వాలేదనిపిస్తున్నా.. స్పిన్నర్ తెవాటియా నిలకడ చూపలేకపోతున్నాడు. దాదాపు అదే జట్టును కొనసాగించే అవకాశాలుండగా.. అదనపు బ్యాట్స్‌మన్‌ను కోరుకుంటే మాత్రం టామ్ కరన్ ప్లేస్‌లో డేవిడ్ మిల్లర్‌ను తీసుకోవచ్చు.

పటిష్టంగా ఢిల్లీ..

పటిష్టంగా ఢిల్లీ..

ఇక ఢిల్లీ జట్టు అన్ని విషయాల్లో సమతూకంగా ఉంది. కెప్టెన్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉండగా, ఓపెనర్ పృథ్వీషా, రిషభ్ పంత్ రాణిస్తున్నారు. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లోనూ ఢిల్లీకి ఎలాంటి ఇబ్బందుల్లేవు. రబడా లీగ్‌లో టాప్ బౌలర్ కాగా.. నోర్జ్ అతనికి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇషాంత్‌కు రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన హర్షల్ పటేల్ కూడా సత్తా చూపెడుతుండగా, అశ్విన్ చేరికతో లైనప్ మరింత బలంగా మారింది. ఢిల్లీ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగవచ్చు.

ముఖా ముఖి:

ముఖా ముఖి:

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 20 సార్లు తలపడగా.. 11-9తో రాజస్థాన్ లీడ్‌లో ఉంది. అయితే గత సీజన్‌లో జరిగిన రెండూ మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ను ఢిల్లీ ఓడించింది. ఇక చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఢిల్లీ మూడు గెలవగా.. రాజస్థాన్ ఒకటి గెలిచింది. అయితే షార్జా వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలవడం ఆ జట్టుకు సానుకూలంశం కాగా.. ఈ మైదనాంలో ఆడిన ఏకైక మ్యాచ్‌లో కోల్‌కతాను ఢిల్లీ ఓడించింది.

 తుది జట్లు:

తుది జట్లు:

రాజస్థాన్‌: యశస్వీ జైస్వాల్‌, జోస్ బట్లర్‌, సంజూ శాంసన్‌, స్టీవ్‌ స్మిత్ (కెప్టెన్‌), మహిపాల్ లోమ్‌రార్, రాహుల్ తెవాటియా, శ్రేయస్‌ గోపాల్‌, టామ్‌ కరన్‌/డేవిడ్ మిల్లర్, జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి, అంకిత్ రాజ్‌పుత్

ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), షిమ్రాన్ హెట్‌మైర్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, అన్రిచ్ నోర్జ్, కగిసో రబడా

పిచ్ రిపోర్టు:

పిచ్ రిపోర్టు:

షార్జా మైదానం యూఏఈలోనే చాలా చిన్న మైదానం. స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతితో పేసర్లు ప్రభావం చూపుతారు. కానీ మైదానం చిన్నది కావడంతో సులువుగా సిక్సర్లు వస్తాయి. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లే నమోదయ్యాయి. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఆంటీ.. ప్లీజ్! దుబాయ్ వెళ్లండి.. ఆండ్రీ రస్సెల్ ఫామ్‌లో లేడు: ఫ్యాన్ ఆవేదన: భార్య ఘాటు రిప్లయ్

Story first published: Friday, October 9, 2020, 15:11 [IST]
Other articles published on Oct 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+