Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వడానికి కష్టపడ్డాం: విరాట్ కోహ్లీ

IPL 2020: Virat Kohli Says We’ve Played Good Enough Cricket In This Tournament To Qualify

అబుదాబి: ఐపీఎల్ 2020లో ప్లే ఆఫ్స్ అర్హత సాధించడానికి తాము కష్టపడ్డామని, మంచి క్రికెట్ ఆడామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్లతో ఓడినా.. మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావడం సంతోషంగా ఉందన్నాడు. ఇదే దూకుడును తదుపరి మ్యాచ్‌ల్లో కనబర్చి తమకు కావాల్సిన ఫలితాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

'ఇది మిశ్రమ ఫలితం. టాస్ సమయంలోనే గట్టిగా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని చెప్పా. 11 ఓవర్‌లో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే 17.3 వరకు తీసుకెళ్లాలని మేనేజ్‌మెంట్ సూచించింది. మా నుంచి ఢిల్లీ మ్యాచ్‌ను లాగేసుకున్నారు. అయినా మేం పోరాడం. మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి కట్టడి చేశాం. ఆఖరి ఓవర్ల వరకు తీసుకెళ్లాం. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావడం సంతోషంగా ఉంది. టాప్-2లో ఉండటం ఏ జట్టుకైనా మంచిది. అయినప్పటికీ మేం మంచి క్రికెట్ ఆడి టోర్నీలో ముందడుగు వేసాం. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్‌కు చేరుతాం.

ఇది మాకు మంచి అవకాశం. మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో దూకుడు కనబర్చాం. బంతితో కూడా బాగానే రాణించాం. ముఖ్యంగా పవర్‌ప్లేలో బలంగా మారం. ఇవన్నీ తదుపరి మ్యాచ్‌ల్లో అమలు చేస్తే మాకు కావాల్సిన ఫలితం వస్తుంది. అయితే సానుకూలంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక మోర్రిస్, సైనీ తదుపరి మ్యాచ్‌లకు ఫిట్ అవుతారని ఆశిస్తున్నా. 'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు) రాణించాడు. డివిలియర్స్‌ (21 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' నోర్జే 3 వికెట్లు తీయగా...రబడ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 19 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ఒకవేళ ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోపే ఛేదించి ఉంటే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రన్‌రేట్‌ కంటే బెంగళూరు జట్టుది తక్కువ అయ్యేది.

Story first published: Tuesday, November 3, 2020, 8:24 [IST]
Other articles published on Nov 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+