Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs KXIP trolls: అయిపాయే.. పంజాబ్‌ను చెన్నై అస్సాం తీసుకుపాయే.. పాపం ప్రీతీ జింటా!

IPL 2020: Twitter Reactions and Funny Mems on CSK Defeating KXIP

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కథ ముగిసింది. వరుసగా ఐదు విజయాలతో ఆశలు రెకెత్తించిన రాహుల్ సేన బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో ఇంటిబాట పట్టింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో కింగ్స్ పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. చెన్నై పోతూ పోతూ తమ వెంట పంజాబ్‌ను ఇంటికి తీసుకెళ్లింది. ఫలితంగా టైటిల్ గెలవాలనే కల పంజాబ్‌కు ఈ సారి కూడా నెరవేరలేదు. దాంతో ఈ మ్యాచ్‌పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయిపాయే.. పంజాబ్‌ను చెన్నై అస్సాం తీసుకుపాయే అనే సెటైర్లు హల్‌చల్ చేస్తున్నాయి.

పాపం ప్రీతీ జింటా..

కింగ్స్ పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింటా ముఖ చిత్రంపై నెట్టింట ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఐపీఎల్ ప్రారంభం నుంచి జట్టుకు అండగా ఉంటూ ఉత్సాహ పరుస్తున్న ఈ సొట్ట బుగ్గల సుందరి.. టైటిల్ కలను మాత్రం నెరవేర్చుకోలేకపోతుంది. గత 12 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ అందని ధ్రాక్షగానే మిగిలిపోయింది. కోచ్‌లు, కెప్టెన్లు మారినా.. స్టార్ ఆటగాళ్లను తీసుకున్నా.. ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. ఈ సీజన్‌లో కూడా కరోనాను సైతం లెక్క చేయకుండా స్టాండ్స్‌లో సందడి చేసిన ఈ బ్యూటీ.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దాంతో ప్రీతి జింటాపై ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. దిగాలుగా కూర్చున్న ఫొటోలతో పాటు.. ‘ఫ్లైయింగి కిస్స్‌లు మిస్సయ్యే'అనే మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

ఆ అంపైర్ తప్పిదమే..

ఇక పంజాబ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో అంపైర్ షార్ట్ రన్ ప్రకటించడం.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంచ్ తేడాలో సిక్స్ కాస్త బౌండరీగా మారడం కొంప ముంచాయని కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. గుండె పగిలిన ఎమోజీలను పంచుకుంటున్నారు. ఇక పంజాబ్ ఇలా గెలిచే మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ విషయాన్నే ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

ట్రెండింగ్‌లో ‘Definitely Not’

ఇక చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ వ్యవహారంపై కూడా నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇది చివరి మ్యాచ్ కాదు కదా? అని హోస్ట్ డానీ మోర్రిసన్ అడిగిన ప్రశ్నకు ధోనీ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ‘Definitely Not'(ఖచ్చితంగా కాదని'అని బదులిచ్చాడు. దాంతో ఈ పదం నెట్టింట వైరల్ అయింది. ట్విటర్ #DefinitelyNot యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.

అపరచితుడిగా రుతురాజ్..

ఇక ఆరంభంలో దారుణంగా విఫలమైన రుతురాజ్.. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా హాఫ్ సెంచరీలు సాధించాడు. దాంతో చెన్నై హ్యాట్రిక్ విజయాలందుకుంది. ఇక రుతురాజ్ బ్యాటింగ్‌పై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అపరిచితుడుని మించిపోయేలా అతని బ్యాటింగ్ ఉందని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 రన్స్ చేసింది. దీపక్ హుడా (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.

KXIP vs CSK: చావో రేవో మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తప్పిదం.. కేఎల్ రాహుల్ నిరసన!

Story first published: Monday, November 2, 2020, 7:09 [IST]
Other articles published on Nov 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+