For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RR trolls:డియర్ ధోనీ ఐపీఎల్‌ నుంచి తప్పుకో.. నిన్ను ఇలా చూడలేకపోతున్నాం!

IPL 2020: Twitter reactions and funny memes after RR beat CSK by 7 wickets

హైదరాబాద్: చావోరేవో మ్యాచ్‌లో చెన్నై చేతులెత్తేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పసలేని ఆటతో ఘోరపరాజయం పాలైంది. ప్లే ఆఫ్ ఆశలను దాదాపు వదిలేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఎలాంటి సన్నాహకం లేకుండానే బరిలోకి దిగినట్లు అనిపించింది. అసలు వారి ఆటను చూస్తుంటే ఇది చెన్నై జట్టేనా? అనే సందేహం కలిగింది. ఈ వైఫల్యంపై చెన్నై అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆటను చూడలేకపోతున్నామని కామెంట్ చేస్తున్నారు. ధోనీ ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని కోరుతున్నారు. అయితే మరికొంత మంది చెన్నై ఆ జట్టు ఫ్యాన్స్‌పై జోకులు పేల్చుతున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ధోనీ భయ్యా .. చూడలేకపోతున్నాం..

సక్సెస్ ఫుల్, వరల్డ్ బెస్ట్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ధోనీ.. తన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన వ్యూహాలతో మ్యాచ్‌లను తనవైపు తిప్పాడు. కానీ ఈ సీజన్‌లో అతని కెప్టెన్సీలో ప్రత్యేకత కనిపించడం లేదు. ఆ మాస్టర్‌మైండ్‌కు ఏమైందని సందేహం కలిగేలా అతని సారథ్యం ఉంది. దాంతో అభిమానులు ధోనీనీ గౌరవంగా తప్పుకోవాలని అతని అభిమానులు సూచిస్తున్నారు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ధోనీ చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘డియర్ ధోనీ దయచేసి ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించు. నువ్విలా ఓడిపోవడం చూడలేకపోతున్నాం' అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

పాపం చెన్నై ఫ్యాన్స్..

ఇక ధోనీసేన ఆటతీరు, వారి అభిమానుల బాధపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. చెన్నై ఫ్యాన్స్‌కు ఏడుపు ఒక్కటే తక్కువ పాపం అంటూ ఎగతాళి చేస్తున్నారు. గత 10 సీజన్లలో వరుస విజయాలతో విర్రవీగారని, ఓటమి బాధేంటో ఇప్పుడు తెలిసిందా అని ప్రశ్నిస్తున్నారు. బలవంతమైన జట్టు బలహీనమైందని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఆర్‌సీబీ ఫ్యాన్స్ చెన్నై అభిమానులను ఓదార్చుతున్నట్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

నీకు నువ్వు.. నాకు నేను..

ఇక ధోనీ, కేదార్ జాదవ్ బ్యాటింగ్ తీరుపై ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ‘నీకు నేను, నాకు నువ్వు.. ఒకరికొకరం బంతులు వృథా చేద్దాం'అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరికొకరు బంతులు తినిపించుకుంటున్నారని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ‘ఏందిరా ఇది మనమేమో టేబుల్ టాపర్‌గా పేపర్‌పై లెక్కలు కడితే వీళ్లేమో తుస్సుమనిపించారు'అని చెన్నై అభిమానులు అనుకుంటున్నట్లు ఉన్న మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు.

IPL 2020: MS Dhoni Gave His No.7 Jersey To Jos Butler, Why | CSK vs RR | Oneindia Telugu

చేతులెత్తేసిన చెన్నై..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ధోనీ (28 బంతుల్లో 28; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' జోస్‌ బట్లర్‌ (48 బంతుల్లో 70 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (34 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి జట్టును విజయాన్నందించారు. ఈ గెలుపుతో రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశలపై ఆశలను రెకెత్తించింది.

MI vs KXIP: థ్రిల్లింగ్ మ్యాచ్‌లో మెరిసిన ఈ బ్యూటీ ఎవరు?

Story first published: Tuesday, October 20, 2020, 11:24 [IST]
Other articles published on Oct 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+