For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs KXIP trolls: ఈ సూపర్ ఓవర్ల స్క్రిప్ట్ రాసిందెవరూ? అంబాని పాత్ర అయితే లేదు కదా..!

IPL 2020: Twitter Reactions After KXIP beat MI In Double Super Over Thrilling Game
IPL 2020: 3 Super Overs in a Day- Historic or Scripted|MI v KXIP Double Super Over Trolls, SRH V KKR

హైదరాబాద్: వాట్‌ ఎ మ్యాచ్‌.. రెండు జట్ల స్కోర్లు సమం కావడమే అరుదైతే.. ఏకంగా సూపర్‌ ఓవర్‌ కూడా మరో సూపర్‌ ఓవర్‌కు దారి తీస్తే ఆ పోరాటాన్ని ఏమని వర్ణించగలం.. ముంబై-పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి అరుదైన సన్నివేశమే ఆవిష్కృతమైంది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన పోరు మునివేళ్ల మీద నిలబెట్టింది. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి రెండు సూపర్ ఓవర్లు ఆడిన మ్యాచ్‌లో పంజాబ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆఖరి వరకు ఊపిరి సడలినవ్వని ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్, సెటైర్స్ పేలుతున్నాయి. ఈ డబుల్ సూపర్ ఓవర్ అదే జరిగిందా? లేక ఎవరైనా స్క్రిప్ట్ రాసారా అంటూ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

అంబాని పాత్ర లేదు కదా..

ఇక ముంబై ఇండియన్స్ విజయాలను ఫిక్సింగ్‌గా భావించే ఓ వర్గం అభిమానులు ఈ మ్యాచ్‌పై కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. వారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో కానీ ఈ ట్వీట్స్, మీమ్స్ మాత్రం అభిమానులకు నవ్వులు పూయిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఓనర్ ముఖేశ్, నీతూ అంబానీ పాత్ర అయితే లేదు కదా? అని ఫన్నీ మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ లీగ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ముంబై జోరుకు పంజాబ్ తాజా మ్యాచ్‌లో బ్రేక్‌లు వేసింది. 9 మ్యాచ్‌ల్లో 6 గెలిచిన ముంబై మూడు ఓడింది. ఇందులో రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్‌లోనే ఓడిపోవడం గమనార్హం.

అమ్మా ఒక్క పదినిమిషాలే..

ఇక మ్యాచ్‌కు సూపర్‌కు దారితీయడం.. సూపర్ ఓవర్ కూడా టై అవడంతో మ్యాచ్ టైమ్ అలానే పెరిగిపోయింది. దీంతో ప్రతీ అభిమాని ఓవైపు టెన్షన్‌తో చచ్చిపోతుండగా.. మరోవైపు టీవీ బంద్ చేసే పడుకోవాలనే ఇంట్లో వాళ్ల నసతో విసిగిపోయారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ట్రోలర్స్ తమ క్రియెటివిటికి పనిపెట్టారు. తెలంగాణ శకుంతల, హీరో సునీల్ ఫొటోలతో ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేశాడు. ‘టీవ్ బంద్ చేసి పడుకోరా? అంటే ఒక్క పదినిమిషాలే'అని కొడుకు అంటున్నట్లు ఉన్న ఈ మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.

ప్రీతీ జింటా వాకిట్లో గేల్, మయాంక్..

ఇక కింగ్స్ పంజాబ్ కో ఓనర్ ప్రీతీ జింటా కూడా ఈ మ్యాచ్‌ను చూస్తూ ఉక్కిరి బిక్కిరి పోయింది. ఒకానొక దశలో తమ జట్టు ఫోర్ కొట్టినా.. ఆనందపడాలో లేక బాధపడాలో తెలియని అయోమయానికి గురైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్రోలర్స్ తమ నైపుణ్యానికి పనిచెప్పాడు. తెలుగు సూపర్ హిట్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు మూవీ టైటిల్‌నుప్రీతి జింటా వాకిట్లో గేల్, మయాంక్‌గా మార్చారు. ఇది కూడా చాలా సరదాగా ఉంది.

క్రిస్ జోర్డాన్ డబుల్‌పై సెటైర్స్..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 రన్స్ చేసింది. క్వింటన్ డికాక్(43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)హాఫ్ సెంచరీకి తోడు చివర్లో కీరన్ పొలార్డ్(12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్), కౌల్టర్ నీల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అనంతరం కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే ఆఖరి బంతికి పంజాబ్ విజయానికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో క్రిస్ జోర్డాన్ లాంగాన్ దిశగా షాట్ ఆడాడు. సింగిల్ తీసి డబుల్ తీసేటప్పుడు క్రిస్ జోర్డాన్ నేరుగా కాకుండా వంకరగా పరుగెత్తి రనౌటయ్యాడు.

షమీ బౌలింగ్ అసాధారణం.. ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిచేలా చేసింది: కేఎల్ రాహుల్

Story first published: Monday, October 19, 2020, 12:10 [IST]
Other articles published on Oct 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+