
మాకు ఇది కొత్తేం కాదు..
‘ఇదేం తొలిసారి కాదు. మాకు తరుచూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. కానీ చివరకు మేం రెండు పాయింట్లు గెలచుకున్నాం. ఇలా తరుచూ జరగదూ కాబట్టి.. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్‌గా ఎలా ఉండాలో తెలియదు. మేం ఓడిన మ్యాచ్‌ల్లో కూడా అద్భుత ప్రదర్శన కనబర్చాం. ఈ తరహా కష్టపడుతూ ప్రతీ మ్యాచ్‌లో గెలవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. 20 ఓవర్లు కీపింగ్ చేసి ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. పిచ్ నెమ్మదిగా ఉందని, ముంబైలో మంచి స్పిన్నర్లున్నారని మాకు తెలుసు. దాంతో మయాంక్, నేను ఓ 50 రన్స్ ఆరంభం ఇవ్వాలనుకున్నాం.

సూపర్ ఓవర్ కోసం..
స్పిన్నర్లపై క్రిస్ గేల్ ఆడుతాడని నమ్మకం ఉంచా. అతను తన అనుభవపూర్వకమైన ఆటతో ఆకట్టుకున్నాడు. జట్టు విజయానికి ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. ఇక సూపర్ ఓవర్ల కోసం ఎవరూ ప్రత్యేకంగా సిద్దమవ్వరు. నాకు తెలిసి ఏ జట్టు కూడా సూపర్ ఓవర్ కోసం సన్నదం కాదు. అలాంటి పరిస్థితుల్లో బౌలర్లపై నమ్మకం ఉంచడం తప్ప చేసేదేం ఉండదు. షమీ ఆరు బంతులు యార్కర్లు వేద్దామనుకున్నాడు. అతనో అసాధారణమైన ఆటగాడు. సీనియర్ ఆటగాళ్లు బాధ్యత తీసుకోవడం చాలా ముఖ్యం. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఓడిన మాకు ప్రతీ విజయం స్వీట్‌గానే ఉంటుంది.

డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించి..
ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో మేం అనుసరించే విధానంపై బాగా చర్చించాం. మైదానంలో ప్రక్రియపై ఫోకస్ పెట్టి ప్రశాంతంగా ఉండాలనుకున్నాం. ఎందుకంటే ప్రతీ ఒక్కరు ప్రొఫెషనల్సే, గట్టిపోటీనిచ్చేవారు. ప్రతీ ఒక్కరికి విజయం కావాలి. ఇక్కడి నుంచి మేం ప్రతీ మ్యాచ్ గెలవాలని మాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయం. మేం మా ఆటను ఆస్వాదించాల్సిన అవసరం ఉంది.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

కని విని ఎరుగని మ్యాచ్..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)హాఫ్ సెంచరీకి తోడు చివర్లో కీరన్ పొలార్డ్(12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్), కౌల్టర్ నీల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో షమీ, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.
తొలి సూపర్ ఓవర్‌లో పంజాబ్ 5 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ కూడా 5 పరుగులే చేసింది. సెకండ్ సూపర్ ఓవర్‌లో ముంబై 11 రన్స్ చేయగా.. గేల్,మయాంక్ సూపర్ బ్యాటింగ్‌తో 4 బంతుల్లోనే పంజాబ్ విజయాన్నందుకుంది.


Click it and Unblock the Notifications

MI vs KXIP: బౌండరీల నిబంధన అమలు చేస్తే ఎవరు గెలిచేవారంటే?










