
రషీద్ ఖాన్‌ను ఇవ్వమన్నారు..
రెండేళ్ల క్రితం ట్రేడింగ్ ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను అడిగారని ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ గుర్తు చేసుకున్నాడు. ఈ ఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్‌ఫోతో మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో కూడా ఢిల్లీ నుంచి తీసుకున్న ట్రెంట్ బౌల్ట్ వారి విజయంలో కీలక పాత్ర పోషించాడని తెలిపాడు. క్వాలిఫయర్-1, ఫైనల్లో ఢిల్లీ పతనాన్ని శాసించాడన్నాడు. అయితే ఇలాంటి ధైర్యం మరే ఫ్రాంచైజీకి లేదని, తమకు అవసరమైతే స్టార్ ఆటగాళ్లను కూడా మొహమాటం లేకుండా అడుగుతుందన్నాడు. ట్రేడింగ్‌ను ముంబై వాడుకున్నట్లు మరే జట్టు వాడుకోలేదని, అదే ఆ జట్టుకు కలిసొచ్చిందన్నాడు.

ముంబై వాడుకున్నట్లు...
‘రెండేళ్ల క్రితం అనుకుంటా రషీద్ ఖాన్‌ను ట్రేడింగ్ ద్వారా ఇవ్వమని ముంబై ఇండియన్స్ మమ్మల్ని సంప్రదించింది. నాకు తెలిసి ఇలా మరే జట్టు కూడా చేయదు. రషీద్ ఇవ్వమని మమ్మల్ని కోరే సాహసం చేయదు. ఇంత ధైర్యం మరెవరికీ లేదు. తమ అవసరం కోసం ముంబై ఏ జట్టు తలుపునైనా కొడుతుంది. ట్రెడింగ్‌ను ఆ జట్టు వాడుకున్నట్లు మరే టీమ్ ఉపయోగించుకోలేదు. నా ఐపీఎల్ అనుభవం ద్వారా నేను గ్రహించినది ఇదే. ట్రేడింగ్ అవకాశాలను కోరు జట్లలో అత్యంత చురుకైన టీమ్ ముంబై. ఇతర ఫ్రాంచైజీలన్నిటినీ ఇలానే అడిగి వారికి కావాల్సిన ఆటగాళ్లను తీసుకుంటున్నారు'అని మూడీ వివరించాడు.

బుద్ది తక్కువ నిర్ణయం..
వరల్డ్ క్లాస్ బౌలర్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్‌కు ఇవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన అతిపెద్ద తప్పిదమని టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. 'ట్రెంట్ బౌల్ట్‌ను ట్రేడ్ చేయడం చెత్త నిర్ణయం. టోర్నీ యూఏఈకి తరలుతుందని వారికి తెలియదని నాకు తెలుసు. కానీ స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై ట్రెంట్ బౌల్ట్ చెలరేగుతాడు. ఐపీఎల్ పవర్ ప్లేలో అత్యుత్తమ బౌలర్. అలాంటి అసాధారణ పేసర్‌ను బలమైన ముంబై జట్టుకు గిఫ్ట్‌గా ఇవ్వడం బుద్ది తక్కువ పని. ఇదేదో ముందే చేసుంటే.. కనీసం ఇతర జట్లు అయినా వేలంలో బౌల్ట్ కోసం ప్రయత్నించేవి. అలా కాకుండా బలమైన ముంబైకి అప్పనంగా ఇచ్చి ఆ జట్టును మరింత పటిష్టం చేశారు'అని మూడీ ఢిల్లీ తీరును తప్పుబట్టాడు.

సీజన్‌కు ముందే షురూ..
ఇక రోహిత్ శర్మ కూడా మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే తాము తమ లోపాలపై దృష్టిసారించామని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించామని తెలిపాడు. కావాల్సిన ఆటగాళ్లను తీసుకున్నామన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రెంట్ బౌల్ట్‌ను తీసుకోవడం ఆ జట్టుకు కలిసివచ్చింది. ప్రతీ సీజన్‌లో తమజట్టుకు అవసరమైన ఆటగాళ్లను సిద్దం చేసుకున్న ఆ టీమ్.. లీగ్‌లోనే బలమైన జట్టుగా నిలిచింది.
ఈ క్రెడిట్ వారిదే.. టైటిల్ గెలవడం సంతోషంగా ఉంది: రోహిత్ శర్మ


Click it and Unblock the Notifications
