Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ క్రెడిట్ వారిదే.. టైటిల్ గెలవడం సంతోషంగా ఉంది: రోహిత్ శర్మ

IPL 2020: Rohit Sharma Says lot of credit goes to the people who worked behind the scenes
IPL Final : Will Rohit Sharma Make It 5 For Mumbai Indians ? | Mi vs Dc | Oneindia Telugu

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ గెలవడంపై ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో గెలిచి టైటిల్ డిఫెండ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్.. ఈ గెలుపు క్రెడిట్ తమ వెనుకుండి నడిపించిన సపోర్ట్ స్టాప్‌దేనని స్పష్టం చేశాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఈ సీజన్‌పై దృష్టి సారించామని తెలిపాడు. గత సీజన్ లోపాలను సరిచేసుకొని జట్టును బలంగా మార్చుకున్నామన్నాడు.

టీమ్ బ్యాలెన్స్ కోసం శ్రమించాం..

టీమ్ బ్యాలెన్స్ కోసం శ్రమించాం..

'ఈ సీజన్‌లో మా టీమ్ ఆటతీరు పట్ల సంతోషంగా ఉంది. గెలవడం అలవాటు చేసుకోవాలని మొదట్లోనే చెప్పాం. తొలి బంతి నుంచే ఫలితాన్ని రాబట్టాలని ఆటగాళ్లందరికి స్పష్టం చేశాం. దాంతో మేం వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఈ క్రెడిట్ అంతా మా వెనుకాల ఉండి, ఏ మాత్రం గుర్తింపు పొందని సపోర్ట్ స్టాఫ్‌దే. ఐపీఎల్ ప్రారంభానికి ముందే మా పని మొదలుపెట్టాం. గత సీజన్ లోపాలను సరిచేశాం. జట్టు సమతూకం కోసం శ్రమించాం. ఆటగాళ్ల వెనుక కర్ర పట్టుకొని పరుగెత్తే రకం నేను కాదు. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం ముఖ్యం. కృనాల్, హార్దిక్, పొలార్డ్ చాలా రోజులుగా వారి బాధ్యతలను నెరవేరుస్తున్నారు.

సూర్య సూపర్..

సూర్య సూపర్..

రాహుల్ ఈ రోజు ఆడలేదు. కేవలం వ్యూహంలో భాగంగానే పక్కన పెట్టామని, ఎలాంటి తప్పు చేయలేదనే విషయం అతనికి చెప్పాల్సిన అవసరం మాపై ఉంది. ఇషాన్, సూర్య కుమార్ యాదవ్‌లో ఆత్మ విశ్వాసం పెంపొందించాం. సూర్య చాలా పరిపక్వత కలిగిన ఆటగాడు. అతను అద్భుత ఫామ్‌తో చెలరేగాడు. నా తప్పిదం కారణంగా అతను రనౌట్ అయ్యాడు. ఫామ్‌లో ఉన్న అతని కోసం నేనే త్యాగం చేయాల్సింది. కానీ అతను నా కోసం ఔటయ్యాడు. ఈ టోర్నీ అసాంతం అద్భుత షాట్స్ ఆడాడు. ఇక దురదృష్టవశాత్తు ఈ సీజన్‌లో మా అభిమానులను మిస్సయ్యాం. వాంఖడేలో ఆడటం మిస్సయ్యాం. వచ్చే సీజన్‌లోనైనా అభిమానుల మధ్య వాంఖడేలో ఆడుతామని ఆశిస్తున్నా'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

బౌల్ట్ సూపర్ బౌలింగ్..

బౌల్ట్ సూపర్ బౌలింగ్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 నాటౌట్), రిషభ్ పంత్( 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) రాణించారు. ముంబై బౌలర్లలో బౌల్ట్(3/30) ఢిల్లీ పతనాన్ని శాసించగా.. కౌల్టర్ నీల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సూపర్ బౌలింగ్‌తో రాణించిన బౌల్ట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Story first published: Wednesday, November 11, 2020, 7:19 [IST]
Other articles published on Nov 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+