Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: ట్విటర్‌లో విరాట్ కోహ్లీ రోస్ట్.. నవ్వించే మీమ్స్.. ట్రెండింగ్‌లో #ThankYouVirat

 IPL 2020: #ThankYouVirat trends on Twitter after Royal Challengers Bangalores loss to Sunrisers Hyderabad

దుబాయ్‌ : 'ఈ సాలా కప్‌ నామ్‌దే(ఈసారి కప్పు మాదే) అంటూ ప్రతీ సీజన్‌లో బరిలోకి దిగడం ఉత్త చేతులతో వెనుదిరగడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి అలవాటైపోయింది. ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశలతో ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బరిలోకి దిగిన ఆ జట్టు పోరాటం ప్లే ఆఫ్స్‌కే పరిమితమైంది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్లతో ఓడి ఇంటిదారి పట్టింది. అయితే నాలుగేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ చేరి అంచనాలు పెంచిన కోహ్లీ సేన ఉత్త చేతులతో వెనుదిరగడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెటైరికల్‌గా #ThankYouVirat యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

దేవుడున్నాడు..

ఇక కోహ్లీ కోసం ఎదురు చూస్తున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆర్‌సీబీ తాజా ఓటమితో చెలరేగుతున్నారు. ట్విటర్ వేదికగా అతనిపై ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దేవుడున్నాడని, కర్మ ఎవరిని వదిలిపెట్టదని ఆస్ట్రేలియా టూర్‌కు రోహిత్‌ పక్కనపెట్టడాన్ని ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ ఎందుకు పనికిరాడని, నాకౌట్ మ్యాచ్‌ల్లో అతను పూర్తి విఫలమవుతాడనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ గణంకాలను కూడా పోల్చుతూ ట్వీట్లు చేస్తున్నారు.

విరాట్‌ను తప్పించండి..

ఇక ఆర్‌సీబీ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోహ్లీ స్థానంలో సూర్య కుమార్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని, విరాట్‌ను కన్నా అతనెంతో మేలని కామెంట్ చేస్తున్నారు. అలాగే కీలక మ్యాచ్‌ల్లో విరాట్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇంకొందరైతే విరాట్ కెరీర్ ముగిసే వరకు కూడా ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేడని కామెంట్ చేస్తున్నారు. అతను దొంగలిస్తేనే కప్ వస్తుందనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

రోహిత్ బెస్ట్ టీమ్‌కు కెప్టెన్..

ఇక విరాట్ కోహ్లీపై జరుగుతున్న ట్రోలింగ్‌ను ఆర్‌సీబీ అభిమానులు తిప్పికొడుతున్నారు. జట్టు సమతూకంగా లేనప్పుడు విరాట్ ఏం చేస్తాడని నిలదీస్తున్నారు. ఇక రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ అనే వాదనను తాము ఏమాత్రం అంగీకరించమని, అతను బెస్ట్ టీమ్‌కు కెప్టెన్ కానీ.. గొప్ప సారథి కాదని కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ లేకున్నా ప్రస్తుత ముంబై ఇండియన్స్ టీమ్ గెలుస్తుందని, అతను డకౌట్ అయినా సునాయస విజయాలందుకుంటుందని ట్వీట్ చేస్తున్నారు . రోహిత్ కన్నా విరాటే ఎంతో బెటరని, అతను తన ఆటతో ఆకట్టుకున్నాడని, ఆర్‌సీబీ, కోహ్లీ అభిమానులుగా ఎప్పుడూ గర్వపడుతామని ముంబై ఫ్యాన్స్‌కు బదులిస్తున్నారు.

లక్కీగా ప్లే ఆఫ్స్‌కు..

ఫస్టాఫ్‌లో 5 విజయాలతో అదరగొట్టిన ఆర్‌సీబీ.. సెకండాఫ్‌లో మాత్రం తేలిపోయింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్రంగా నిరాశపరిచింది.

రన్‌రేట్‌ కాస్త మెరుగ్గా ఉండడం.. లీగ్‌ రెండో అంచెలో వరుస విజయాలతో రేసులోకి వచ్చిన పంజాబ్‌తో పాటు కోల్‌కతా, రాజస్తాన్‌లు కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడంతో ఎలాగోలా లక్కీగా చేరింది. అయితే ఒత్తిడికి మారుపేరుగా ఉండే ఆర్‌సీబీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది.

అసలు ఆడుతుంది ఆర్‌సీబీనేనా అన్నట్లు వారి ఆట కొనసాగింది. పేలవమైన బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది.

నటరాజన్‌కు స్పెషల్ డే.. పాప పుట్టిన వేళావిశేషం.. కళ్లు చెదిరే యార్కర్‌‌కు డివిలియర్స్ ఔట్!

Story first published: Saturday, November 7, 2020, 21:42 [IST]
Other articles published on Nov 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+