Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నటరాజన్‌కు స్పెషల్ డే.. పాప పుట్టిన వేళావిశేషం.. కళ్లు చెదిరే యార్కర్‌‌కు డివిలియర్స్ ఔట్!

IPL 2020: Sunrisers Hyderabad pacer T Natarajan and his wife blessed with a baby girl

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ యార్కర్ల కింగ్ టీ నటరాజన్‌కు నవంబర్ 6(శుక్రవారం) ఓ ప్రత్యేకమైనా రోజుగా నిలిచిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించి టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు శుక్రవారం ఉదయం నటరాజన్ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

'నటరాజన్, అతని సతీమణికి అభినందనలు.. నట్టూ భార్య ఈ ఉదయం ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అతనికిది అద్భుత గిఫ్ట్' అని డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఇక పాప పుట్టిన వేళ విషేషం.. నట్టూకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో అతను అద్భుత యార్కర్లతో ఆర్‌సీబీని కట్టడి చేశాడు. అంతేకాకుండా కళ్లు చెదిరే యార్కర్‌తో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ను క్లీన్ బౌల్ట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో నటరాజన్ రెండు వికెట్లు తీశాడు.

తమిళనాడులోని మారుమూల ప్రాంతానికి చెందిన నటరాజన్ టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడుతూ.. ఈ స్థాయికి చేరుకున్నాడు. ఏడాదిన్నర క్రితం పావి శక్తినితో నట్టూ వివాహం జరిగింది. ఈ సీజన్‌లో అత్యధిక యార్కర్లు వేసిన బౌలర్‌గా గుర్తింపు పొందిన నటరాజన్‌‌కు యార్కర్ల నట్టూగా బిరుదిచ్చారు. అతని యార్కర్లకు ఫిదా అయిన కామెంటేటర్ హర్షా భోగ్లే.. కూడా అతన్ని యార్కర్ల నటరాజన్ అని పిలిస్తే బాగుంటుందన్నాడు.

ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచిన వార్నర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌ (43 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. ఫించ్‌ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కేన్‌ విలియమ్సన్‌ (44 బంతుల్లో 50 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేసన్‌ హోల్డర్‌ (20 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు) కలిసి జట్టును విజయతీరం చేర్చారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 47 బంతుల్లో 65 పరుగులు జోడించడం విశేషం. ఆదివారం జరిగే రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది.

Story first published: Saturday, November 7, 2020, 20:52 [IST]
Other articles published on Nov 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+